Beer Sales: ఏం తాగార్రా నాయనా.. 18 రోజులు 23 లక్షల కేసుల బీర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beer Sales: ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. తెలంగాణలో ఎండలు ఏ రేంజ్‌లో విజృంభిస్తున్నాయో తెలియంది కాదు.. ఉదయం 9 గంటలు దాటితే నిప్పుల కొలిమిలా తయారైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం 07 గంటల వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
Read also: Vijayasai Reddy: ఇచ్చిన డబ్బులు తీసుకోండి.. వైసీపీకి ఓటు వేయండి..
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
తాజాగా ఎక్సైజ్ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు మందు బాబులు రూ.670 కోట్లు విలువైన 23 లక్షల కేసుల బీర్ రాష్ట్రవ్యాప్తంగా తాగేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే బీర్ల విక్రయాలు 28.7% పెరిగాయని చెబుతున్నారు. గత 15 రోజులుగా బీర్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో అమ్మకాలు మరింత తగ్గాయని.. లేదంటే పెరిగేదని చెబుతున్నారు. వర్షం ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడిందని వాపోతున్నారు. ఈ నెలలోనే ఇలా ఉంటే వచ్చే నెలలో బీర్ల విక్రయాలు మరింత ఎక్కువగా ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా తెలంగాణలో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలం అయితే మరీ.. కాకపోతే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.
Mainpuri Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి.. 24 మందికి గాయాలు
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!