DK Aruna: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్.. రేవంత్ రెడ్డి పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ రేవంత్ రెడ్డి అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాపై ముప్పేట దాడి చేస్తున్నారని తెలిపారు. ఒక ఆడ బిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా, రాబందులగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒక పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.
Read also: Delhi Excise Scam: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్..
Also Read
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి? అని ప్రశ్నించారు. నా బాగోతం ఎందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అంటూ డీకే అరుణ సవాల్ చేశారు. నీ మాటలు ఒక ముఖ్యమంత్రికి అగౌరవం అన్నారు. నువ్వు దొరవి నీది దొర కుటుంబం అన్నారు. మాది రైతు కుటుంబం.. పేదల కోసం పోరాటం చేసిన చరిత్ర మాదన్నారు. చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంటా జాతి రంగు గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. ఏం పాపం చేశాను.. పాలమూరు కి నేను చేసిన ద్రోహం ఏంటిది? అని ప్రశ్నించారు. ఇదేనా సంస్కారం ఆడ పిల్లల గురించి మాట్లాడేది అని మండిపడ్డారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతమందికి ఆరోగ్య శ్రీ అందించారు.. దీనిపై లెక్కలు చెప్పండి అని డిమాండ్ చేస్తున్నా అన్నారు.
Read also: Mainpuri Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి.. 24 మందికి గాయాలు
గ్యాస్ సిలిండర్ల ధర గురించి తప్పుడు లెక్కలు చెబుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్ ద్వారా పేదలకు అందించిన ఘనత ప్రధాని మోడీది అన్నారు. ఉజ్వల సిలిండర్ పేదలకు 528 రూపాయలకు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్.. ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. పచ్చి అబద్ధాలు మానేయ్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు 15 లోపు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తావా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో అన్ని గాలి మాటలు చెబుతున్నారు.. జూటా మాటలు బంద్ చేయండి అన్నారు.
Read also: Manchu Vishnu : ఆ సూపర్ హిట్ మూవీస్ రీమేక్ చేయాలనీ ఉంది..
రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఓటు అడగాలి.. ఎంపీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కాంగ్రెస్ కు లేదని కీలక వాఖ్యలు చేశారు. ఒక్క మహిళను ఎదుర్కోవడానికి ఐదు సార్లు రేవంత్ పాలమూరు జిల్లాకు వచ్చారన్నారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రజలు గెలవాలని కోరుకుంటుటే చూసి ఓర్వలేక ఆడపిల్ల అని చూడకుండా నీచమైన మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రతి పాలమూరు ఆడ బిడ్డ ఆలోచించాలి.. ప్రజల మధ్య ఉండే నన్ను ఈ రకంగా భాష మాట్లాడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Son Stabbed Mother: దారుణం.. కన్నతల్లిని కత్తితో పొడిచిన కసాయి కొడుకు
తాజావార్తలు
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!