Site icon NTV Telugu

BC Reservation : రాజ్‌ భవన్‌కు చేరిన బీసీ రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌

Bc Bill

Bc Bill

BC Reservation : బీసీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018లో చేసిన బీసీ రిజర్వేషన్‌ బిల్లులో సవరణ చేస్తూ తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది.

2018లో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 32 శాతం నుంచి తగ్గించి 22 శాతానికి పరిమితం చేస్తూ ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ తగ్గింపు తీరుపై అప్పట్లోనే పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. తక్కువ రిజర్వేషన్‌తో బీసీలకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమైంది.

Kota Srinivas : కోట శ్రీనివాస్ నుంచి నటన నేర్చుకున్నా.. జెనీలియా ఎమోషనల్..

ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే విధంగా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. దీనివల్ల బీసీలకు ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో మరింత అవకాశాలు లభించనున్నాయి. తాజా ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభిస్తే, ఇది తక్షణమే అమలులోకి రానుంది.

బీసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. రాజకీయంగా బీసీ వర్గానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే రిజర్వేషన్‌ పెంపు చర్యకు శ్రీకారం చుట్టినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

CM Chandrababu: అసలుసిసలు తెలుగు బిడ్డ పీవీ.. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం..

Exit mobile version