NTV Telugu Site icon

BC-OBC Reservations: ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో బీసీ, ఓబీసీ విద్యార్థి నేతల నిరసన దీక్ష..

Bc

Bc

BC-OBC Reservations: సమగ్ర కుల గణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ పెంపును డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు దీక్షకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో బీసీ, ఓబీసీ విద్యార్థి నేతల నిరసన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 10వ తేదీన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీసీల సత్యాగ్రహ దీక్ష చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్స్ కల్పించాలి.. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి.. కులగణన, బీసీ రిజర్వేషన్స్ హామీని అమలు చేయాలని బీసీ సంఘాల నేతలు డిమండ్ చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ కులగణన అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది.. మేము ఎవరిని అడగకుండా.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు బీసీ రిజర్వేషన్స్ పై హామీలు ఇచ్చారు.. ఎన్నికల్లో గెలిచారు, అధికారంలోకి వచ్చారు ఇప్పుడు హామీని మర్చిపోయారు అంటూ మండిపడ్డారు.

Read Also: Bulldozer action: అయోధ్య గ్యాంగ్‌రేప్ నిందితుల ఆస్తులపై బుల్డోజర్ యాక్షన్

ఇక, బీసీలను బీజేపీ పద్మవ్యూహంలోకి నెట్టారు అని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అంటున్నారు అని బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. మరి మీరు అధికారంలో ఉన్న తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ పై ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఠా బీసీల గొంతు కోయాలని చూస్తుంది.. బీసీల ఆశయ సాధన కోసం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి పోరాడుతాం.. బీసీలకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు.. దేశంలో ఇంకా రెండో పౌరులుగానే ఉన్నామన్నారు.

Read Also: Tollywood: తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

అలాగే, ఈ నెల 7వ తేదీలోపు ఓబీసీ రిజర్వేషన్స్ పై కమిటీ వేయాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని చేపడుతాం.. ప్రతి ఎలక్షన్స్ లో పార్టీలు గద్దెనక్కడానికి ఓట్ల కోసం హామీలు ఇస్తున్నాయి.. దేశంలో 80 కోట్ల జనాభా ఉన్న వర్గాలకు అన్యాయం జరుగుతుంది.. తెలంగాణ నుంచి గ్రామీణ స్థాయి నుంచి బీసీల ఉద్యమం మొదలయ్యింది.. గెలిచిన ఆర్నెలల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చెప్పింది.. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ పేర్కొనింది.. ఎనిమిది నెలలు అవుతున్నా ఇంకా కులగణన మాట లేదు అని ఆయన ప్రశ్నించారు. కులగణన, రిజర్వేషన్స్ అమలను డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామన్నారు. ప్రజలు అనుకున్నది బీఆర్ఎస్ చేయనందుకే మీకు అధికారం ఇచ్చారు అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Read Also: Alien Temple: ఇదేందయ్యా ఇది.. గ్రహాంతరవాసికి గుడి కట్టేస్తున్న వ్యక్తి..

కాగా, ఓబీసీ అయినా ప్రధాని మోడీ.. ఓబీసీల గురించి ఆలోచించాలి అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్రంలో బీసీలకు మంత్రులను చేయాలి.. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.. గ్రామీణ స్థాయి నుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు.. దీక్షలు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలే రిజర్వేషన్స్ కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలి.. అన్ని సంఘాలు, అన్ని పార్టీల నాయకులందరూ ఏకాభిప్రాయంతో ముందుకు రావాలి.. మా మౌనాన్ని, ఓపికను, చేతగాని తనంగా అనుకుంటున్నారు.. బీసీలను అణిచివేయాలని చూస్తున్న వారు మాడి మసైపోతారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments