Site icon NTV Telugu

Basara IIIT: ఇది ట్రబుల్ ఐటీ.. మొన్న సబితా, నిన్న తమిళిసై వెళ్లినా అంతే..!

Basara Iiit

Basara Iiit

Basara IIIT students are facing problems due to power cut: బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు తీరడంలేదు. బాసర ట్రిపుల్‌ ఐటీ ట్రబుల్‌ ఐటీగా మారింది. ఎంత మందికి విద్యార్దులు వారి సమస్యలను చొప్పుకున్నా. సరా మామూలుగానే వుంటోంది. కలుషిత ఆహారం, సరైన సౌకర్యాలు లేవని అధికారులకు విన్నవించిన మాటలవరకే పరిమితం చేస్తున్నారు. ఎండ, వాన అని తేడా లేకుండా సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలు చేసిన పరిష్కార మార్గం కనిపించలేదు. మెస్‌ లో తినడానికి కుర్చీలు లేక, సరైన తిండిలేక, వసతులు కరువయ్యాయి. నిన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అంధకారం అలుముకుంది. నిన్న మధ్యాహ్నం నుంచి క్యాంపస్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కోతపై మండిపడుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చెబుతోంది. కాగా క్యాంపస్లో సమస్యలపై ఇటీవలే విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

జూన్‌ 15న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని ఆమె విద్యార్థులను కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వీసీకి సమాచారం అందించాలని తెలిపారు. రెండేళ్ల నుంచి యూనివర్సిటీ, స్కూళ్లు సరిగా నడవలేదని.. రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తాయని..త్వరలోనే ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని..చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని సబిత అన్న విషయం తెలిసిందే.

read also: Basara IIIT: ఇది ట్రబుల్ ఐటీ.. మొన్న సబితా, నిన్న తమిళిసై వెళ్లినా అంతే..!

జులై 31న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థులకు మంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మా తోబుట్టువుగా సబితా రెడ్డికి సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతలేని ఆహారం తిని ఇప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు.

ఆగస్టు 7న బాసర ట్రిబుల్‌ ఐటి విద్యార్థుల సమస్యలను పరీక్షించేందుకు నిర్మల్ జిల్లా బాసరకు గవర్నర్‌ తమిళిసై స్వయంగా వెళ్లారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో మెస్‌ను ను గవర్నర్‌ పరిశీలించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. మెస్‌ నిర్వాహణపై విద్యార్థులు అసంతృప్తిగా వున్నారని గవర్నర్‌ తెలిపారు. విద్యార్థుల 12 డిమాండ్ లను ఎస్ జీసీ గవర్నర్ తెలిపారు. విద్యార్థినిల సమస్యలు, మెస్ లలో పరిస్తితితో పాటు క్యాంపస్ లో పోలీస్ లు ఉండడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

ట్రిబుల్ ఐటీ విద్యార్థులు మాట్లాడుతూ.. ఎంతమంది అధికారులకు మాసమస్యలు చెప్పుకున్నా సరా మామూలుగానే వున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసారు. విద్యార్తులు మృతి చెందుతున్న పట్టించుకునే దుస్థితిలో ప్రభుత్వం వుందని మండిపడుతున్నారు. సమస్యల ఎప్పుడు తీరుతాయని, ఇలాంటి పరిస్థితే వస్తే త్రిబుల్ ఐటీలో సమస్యలు తప్పా, ఇంకేమీ వుండదని వాపోతున్నారు. వారిని అర్థం చేసుకుని వారి సమస్యలను ప్రభుత్వం తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మాపై దయచేసి దయ చూపండని వేడుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం స్పందన ఎలా వుంటుందో..?

Super-Earth: భూమి లాంటి గ్రహాన్ని కనుక్కున్న నాసా..

Exit mobile version