NTV Telugu Site icon

Bank of Baroda: వృద్ధుల ఆశ్రమానికి సాయం చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా

Bank Of Baroda

Bank Of Baroda

Bank of Baroda: ఖాతాదారులకు అద్భుత సేవలందించే బ్యాంక్ ఆఫ్ బరోడా పరుల సేవలోనూ ముందుంటామని నిరూపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 114 సంవత్సరాలు పూర్తి చేసుకుని 115వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భంగా బ్యాంకు స్ట్రీట్ శాఖ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మౌలాలిలో గల షాలోమ్ వృద్ధుల ఆశ్రమానికి రూ.25 వేల విలువ గల వాషింగ్ మెషీన్‌ను బ్యాంకు సిబ్బంది అందజేశారు.

Satellite Internet: దేశంలో మరో కొత్త టెక్నాలజీ.. శాటిలైట్ ఇంటర్నెట్‌తో కేబుళ్లు అవసరం లేదండోయ్..!!

బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు 1908 జులై 20న ఏర్పడిందని బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టాన్లీ జోన్స్ అన్నారు. ప్రస్తుతం 8,214 బ్రాంచీలు, 12వేల మంది సిబ్బందితో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోందని తెలిపారు. బ్యాంక్ కేవలం ఖాతాదారులకు సేవలందించడమే కాకుండా సామాజిక సేవ కూడా చేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అని.. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్ గోవిందప్ప, వృద్ధాశ్రమ నిర్వాహకులు డి. శ్రీనివాస్, లూథియా పాల్గొన్నారు.