బంజారాహిల్స్ లో హల్ చల్ చేసిన హైదరాబాద్ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారు మాజీద్ హుస్సేన్.. ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.. అయితే. పోలీసులపై విరుచుకుపడుతూ అసభ్యకర రీతిలో మాట్లాడారు మాజీ మేయర్.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేసింది… మాజీద్ హుస్సేన్ పై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఇక, మాజీద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.. ఫిలింనగర్ భూ వివాదంలో నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిని బెదిరించినందుకు ఒక కేసు పెడితే.. అడ్డుకున్న పోలీసులపై దుర్భాషలాడినందుకు మరో కేసు నమోదు చేశారు.. తమ విధులను అడ్డుకున్నారు అంటూ ఎస్సై రవిరాజ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.