Bandisanjay sensational comments on CM KCR: నేను బూతులు మాట్లాడుతున్నాన? అయితే నాకు గురువు సీఎం కేసీఆర్ యే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడుతున్నది బూతులైతే.. వాళ్ళు మాట్లాడుతున్నది బూతులా? అంటూ ప్రశ్నించారు. హరీష్ నీకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో ముందు చెప్పు అంటూ వ్యంగాస్త్రం వేశారు. గోబెల్స్ ను మించిన వ్యక్తి కేసీఆర్ అంటూ ఆరోపణలు చేశారు. ఆయన అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని, ముందు నీళ్ళు ఇవ్వమని చెప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్లు ఇస్తానన్నారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం 40వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఇంటింటికి నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఇవ్వకపోతే కేసీఆర్ ఓటు అడగనన్నారు కదా.. మరి ఇంటింటికి నీళ్లు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. జల జీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాల్లోని ఇంటింటికి కేంద్రం నీళ్లు ఇచ్చిందని పేర్కొన్నారు.
Read also: Medico Preethi Case: మెడికో ప్రీతి మృతి కేసు.. ప్రధాన నిందితుడు సైఫ్‌కి కోర్టు బెయిల్
కేంద్ర ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తుందని అన్నారు. 10 లక్షలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుందని తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు అమిత్ షా చేవెళ్లకు రాబోతున్నారని వెల్లడించారు. చేవెళ్ల పార్లమెంట్ కు చెందిన నేతలతో అమిత్ షా సమావేశం అవుతారని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఇక స్పీకర్ పోచారం పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ బాన్సువాడలో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ తరహాలోనే బాన్సువాడలోనూ కుటుంబ పాలన కొనసాగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషనరీ స్కాంలో అడ్డంగా బుక్కై కేబినెట్ నుండి బర్తరఫ్ అయిన వ్యక్తికి రాజ్యాంగబద్ద పదవిస్తే ఇట్లనే ఉంటదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tarun Chugh: రేవంత్ రెడ్డి పార్టీని వీడే టైమ్ దగ్గరలోనే ఉంది