Site icon NTV Telugu

Bandisanjay is Serious about CM KCR: దేశ రాజకీయాలు సంగతి తర్వాత.. గురుకుల విద్యార్థులపై దృష్టి పెట్టండి..

Kcr Bandi Sanjay

Kcr Bandi Sanjay

Bandisanjay is Serious about CM KCR: వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని. అస్వస్థత అయిన బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్‌ చేశారు. బల్లి పడ్డ ఆహారం తినడం వల్లనే దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఇందులో కొంతమంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోందని తెలిపారు.

వరుసగా గురుకులాల్లో ఇలాంటి ఘటనలు ఈ రెండు నెలల్లో చాలా జరిగాయని గుర్తు చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బండి సంజయ్‌ మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో కనీస వసతులు కూడా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు… దేశ రాజకీయాలు సంగతి తర్వాత చేద్దురు కానీ, ముందుగా గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నానని బండిసంజయ్‌ ట్విటర్‌ వేదిక సీఎం పై మండిపడ్డారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్‌ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 40 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 40 మంది విద్యార్థులకు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా అధికారులు తెలిపారు. 12 గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా.. ఎంజీఎం కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారని అధికారులు పేర్కాన్నారు. రాత్రి భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారని సమాచారం. కడుపు నొప్పితో పిల్లలు అల్లాడుతున్నారని వాపోయారు. విద్యార్థులకు ప్రథమచికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. విద్యార్థుల పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Exit mobile version