Bandi Sanjay’s election campaign in Munugode: ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ మునుగోడు ఉప ఎన్నికలు.. పార్టీల మధ్య ప్రచార జోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ.. ఒకరిమీద ఒకరు విమర్శనాస్త్రాలు వేసుకుంటూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీకీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇక నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామానికి బండి సంజయ్ చేరుకున్నారు. ప్రచారంలో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. తిరుగుండ్లపల్లి గ్రామంలో బండి సంజయ్ రోడ్ షో ప్రారంభమైంది.
నేటి షెడ్యూల్..
ఇక నేటి నుండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బండి సంజయ్ ఉదయం 11 గంటలకు తిరు గుండ్లపల్లి, థమ్మాడపల్లి గేట్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు… ఇక, మధ్యాహ్నం 12 గంటలకు అజలాపురం, ఎరగండ్లపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 12 గంటల 30 నిమిషాలకు కొండూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఆ పై నాలుగు గంటలకు మర్రిగూడ క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొంటారు.
Read also: Suspicion on Wife: భార్యను 15 సార్లు పొడిచి చంపిన భర్త ఆతరువాత..
ఇప్పటికే మునుగోడులో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు , కాషాయం పార్టీకూడా గట్టిగానే ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేస్తూ.. నిప్పులు చెరుగుతూ.. గళం వినిపిస్తున్నారు. అయితే.. ఇన్నిరోజులు బండి సంజయ్ ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనలేదు. దీంతో మునుగోడులో తన ప్రచారం చేసేందుకు బండి సంజయ్ ఢిల్లీ పర్యటలో ముగించుకుని మునుగోడు ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. దీంతో మునుగోడు ప్రచారంలో పార్టీ నేతలు పోటీపోటీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక 12 రోజుల రోడ్ షో తో బండి సంజయ్ మునుగోడు ప్రచారంలో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేదుకు పక్క ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి తరుపున ఆయన ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే బీజేపీ మీకు అండగా వుంటుందని, బీజేపీతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని బండిసంజయ్ పేర్కొన్నారు. నిన్న సాయంత్రం మునుగోడుకు బండిసంజయ్ చేరుకున్నారు. నేటి నుంచి 12 రోజుల పాటు రోడ్ షోలతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపుతూనే.. ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు బీజేపీ శ్రేణులు.