Site icon NTV Telugu

TSPSC: గవర్నర్‌ ను కలిసిన బీజేపీ నేతల బృందం.. నాలుగు డిమాండ్లపై చర్చ

Tamilisai, Bandi Sanjay

Tamilisai, Bandi Sanjay

TSPSC: తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీక్‌ వ్యవహారంపై నేడు గవర్నర్ తమిళిసైను బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఈటెల రాజేందర్, ఏవీఎన్ రెడ్డి కలిశారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేయనున్న నేపథ్యంలో గవర్నర్‌తో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ లు రాజీనామ చేయాలని, TSPSC చైర్మన్ , సభ్యులను డిబార్ చేసి కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. సిట్టింగ్ జడ్జ్ తో న్యాయవిచారణ చేయించాలని, ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరునున్నారు. ఈ నాలుగు విషయాలపై గవర్నర్ తో బీజేపీ బృందం చర్చిస్తుంది.

Read also: Gold Rate Today: బంగారం కొంటున్నారా?.. కొత్త రేట్లు తెలుసుకోండి

టీఎస్ పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలు కు పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది. కాగా.. టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరగనుంది.
Bandi sanjay: నేడు మహిళ కమిషన్ ముందుకు బండి సంజయ్..

Exit mobile version