వేములవాడ రాజన్న సిరిసిల్లా జిల్లాలో రాజరాజేశ్వర స్వామి దర్శన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అన్ని సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. సర్వేల రిపోర్టుతో కేసీఆర్ ఖంగుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు దిగజారిపోతుంది. కార్యకర్తల త్యాగాల ఫలితంగా రానున్న రోజులు బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
Read Also: ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ రూల్స్‌పై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ
ఎమ్మెల్యేలను ఎంపీలను అరెస్టు చేయించి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిపోయింది. 370 జీఓ గురించి ప్రభుత్వం మళ్లీ ఆలోచించుకోవాలి. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులతో బీజేపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారన్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని బండి సంజయ్ అన్నారు.కేసీఆర్ నీళ్లు, నిధులు నియామకాలు, అభివృద్ధి, హామీల, విషయంలో తెలంగాణను నిండా ముంచాడని పేర్కొన్నారు.కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిధ్దం అంటున్నాడు. ఏం అభివృద్ధి చేశాడో, ముందస్తు కి ఎందుకు, వెళ్తున్నాడు ప్రజల ముందు బహిర్గతం చేయాలని బండి సంజయ్ విమర్శించారు.
