Bandi Snajay: రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పర్యటించనున్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ లో వడగండ్ల వానతో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించనున్నారు. పంట నష్టంపై రైతులను అడిగి వివరాలు తెలుకోనున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రములో ఈదురు గాలులకు చెట్టు విరిగి చనిపోయిన ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇక నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ లేని ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదనే సాకుతో కాలయాపన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు కర్రలు కాల్చారని మండిపడ్డారు.
Read also: Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. సులువుగానే దర్శనం…!
అధికారమే ధ్యేయంగా ఆరు హామీలు, అరవై ఆరు పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలను మోసం చేస్తూ తన అసమర్ధతను, అబద్ధపు వాగ్దానాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఆరు హామీలతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారం చేపట్టి అమలు విషయంలో రేవంత్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కాంగ్రెస్ వాగ్దానాలకు గ్యారెంటీ లేకపోవడంతో వారంతా ఫోర్-ట్వంటీలుగా మారిపోయారు. అనేక హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. ఆరు హామీలపై తీసుకువస్తామని చెప్పిన చట్టం ఎక్కడ.. పగ్గాలు చేపట్టాక రైతులకు ఇస్తామని చెప్పిన రుణమాఫీ ఎక్కడిది? మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇస్తామని చెప్పిన 2500 రూపాయలు అందరికీ ఇచ్చారా? అన్నదాతలకు ఇస్తామని చెప్పిన రైతు రూ.15 వేల హామీ ఎవరికి ఇచ్చారు? అని ప్రశ్నించారు.
Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. సులువుగానే దర్శనం…!