NTV Telugu Site icon

తెలంగాణ‌లో మ‌రో పాద‌యాత్ర‌…

రాజ‌కీయాల్లో పాద‌యాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉన్న‌ది.  గ‌తంలో నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చేముందు పాద‌యాత్ర‌లు చేసిన సంద‌ర్బాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇద్దరు నేత‌లు అధికారంలోకి వ‌చ్చేముందు పాద‌యాత్ర‌లు చేశారు.  ఆ పాద‌యాత్ర‌ల కార‌ణంగా వారు అధికారంలోకి వ‌చ్చారు.  2019లో జ‌రిగిన ఎన్నిక‌లు ముందు ఓ యువ‌నేత పాదయాత్ర చేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌న చేతులు మారింది.  కాగా, ఇలాంటి పాద‌యాత్ర ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ప్రారంభం కాబోతున్న‌ది.  

Read: వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్ ఖాన్ విడాకులపై ఆర్జీవీ

ఆగ‌స్టు 9 నుండి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు తొలివిడ‌త పాద‌యాత్ర‌కు బీజేసీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ శ్రీకారం చుట్టుతున్నారు. హైద‌రాబాద్‌లోని చార్మీనార్ నుంచి హుజూరాబాద్ వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌బోతున్నారు.  మొత్తం నాలుగు విడ‌త‌ల్లో తెలంగాణ మొత్తం పాద‌యాత్ర చేయబోతున్న‌ట్టు బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు.  తెలంగాణ‌లో గ‌డిల పాల‌న‌కు వ్య‌తిరేకంగా, ప్ర‌జాస్వామ్య తెలంగాణ కోస‌మే పాద‌యాత్ర చేయ‌బోతున్న‌ట్టు బండి సంజ‌య్ పేర్కోన్నారు