NTV Telugu Site icon

Bandi Sanjay కేసీఆర్ నిర్ణయాలతో రైతులు బికారులు అవుతున్నారు

Bandi Sanjay

Bandi Sanjay

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత పాదయాత్రలో.. 31 రోజుల్లో 383km పూర్తి చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.

ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి విజవంతం చేసినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందని అన్నారు. అమిత్ షా సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.

కేసీఆర్ ఇంటికో ఉద్యోగం హామీ అటకెక్కిందని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. వ్యాట్ ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని అన్నారు. ఫసల్ భీమా యోజన అమలు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ.. కోటీశ్వరుడు అవుతుంటే.. రైతులు మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో బికారులు అవుతున్నారు.

కేసీఆర్ రైతులను అరిగోస పెడుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటామ‌ని బండి సంజ‌య్ అన్నారు. నీళ్లు,నిధులు, నియామకాలలో న్యాయం జరగాలంటే.. బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే అని స్పష్టం చేశారు. 4 శాతం ఉన్న మైనారిటీ రిజర్వేషన్లు తీసేసి, SC,ST,OBC రిజర్వేషన్లు అమలు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

నిన్న బహిరంగ సభలో వరుణ దేవుడు కరుణించి, వాన కురిపించాడని సంతోషం వ్య‌క్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ పగటి వేషగాళ్ళని ఎద్దేవ చేశారు. గంగిరెద్దులను ఆడించే వారికి విశ్వాసం ఉంటుంది కానీ.. వీళ్లకు అది కూడా ఉండదని మండి పడ్డారు. గంగిరెద్దు వాళ్లపై కూడా కేసీఆర్ ప్రభుత్వం టాక్స్ లు విధిస్తారేమో.. అంటూ ఎద్దేవ చేశారు.

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తామ‌ని అన్నారు. కేసీఆర్ కు పచ్చ కామెర్ల రోగం ఉందని, తెలంగాణలో ఆకుపచ్చ ని జెండాలను ఎగరనివ్వమ‌ని.. బంగాళాఖాతంలో కలిపేస్తామ‌ని అదే బీజేపీ లక్ష్యం మ‌ని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలి కానీ.. శృతి మించి ఉండడం మంచిది కాదని అన్నారు.

కాషాయపు కండువా కప్పుకున్న టీఆర్ఎస్ నాయ‌కులు

వనస్థలిపురం టిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అంజన్ గౌడ్ సహా వందలాది మంది టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఎల్బీ నగర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో కాషాయపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ కి స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మ‌రికాసేపట్లో ఖమ్మం చేరుకొని సాయి గణేష్ కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించనున్నారు.

Nizamabad Hospital: ప్రభుత్వాసుపత్రిలో ఖాళీలతో పని వత్తిడి