Site icon NTV Telugu

Bandi Sanjay Arrest: ఖైదీ నెంబర్ 7917.. జైల్లో ఎలా ఉన్నారంటే..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay Arrest: తెలంగాణ పదో తరగతి పేపర్ లీకేజీ కేసు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెడకు చుట్టుకుంది. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ ని పోలీసులు కరీంనగర్ జైలులో ఉంచారు. బండి సంజయ్ రిమాండ్ ను సవాల్ చేస్తూ బీజేపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు CJ విచారణ చేపట్టన్నారు. కాగా.. పరీక్ష సమయానికి ప్రశ్నపత్రం బయటకు వచ్చి సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించడంతో పోలీసులు సంజయ్‌ను రోల్ ప్లేయర్‌గా అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంజయ్‌ను బుధవారం హన్మకొండ జిల్లా చీఫ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏ1- బండి సంజయ్‌ కుమార్‌ (51), ఏ2- బూరం ప్రశాంత్‌ (33), ఏ3 – గుండెబోయిన మహేశ్‌ (37), ఏ4- మైనర్‌, ఏ5- శివగణేశ్‌ (19), అరెస్టయిన నిందితులు కాగా.. ఇక పరారీలో ఏ6- పోగు సుభాష్‌ (41), ఏ7- మైనర్, ఏ8-మైనర్, ఏ9- పెరుమాండ్ల శ్రామిక్‌ (నాని) (20), ఏ10- పోతబోయిన వర్షిత్‌ (చందు)(19) నిందితులు ఉన్నారు వీరికోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Read also: Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం

ఇది ఇలా ఉండగా.. సంజయ్ లాయర్ల విజ్ఞప్తి మేరకు బండిని కరీంనగర్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. పోలీసులు సంజయ్‌ను కరీంనగర్‌ జైలుకు తీసుకొచ్చి గోదావరి బ్యారక్‌లో ఉంచారు. జైలు అధికారులు సంజయ్‌కు ఖైదీ నంబర్ 7917ను కేటాయించారు. కరీంనగర్ జైలులో ఉన్న సంజయ్‌ను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. సంజయ్ ని కలిసేందుకు అనుమతించని జైలు అధికారులు.. బట్టలు, ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో బండి అపర్ణ కరీంనగర్ జైలు నుంచి భర్తను కలవకుండా వెనుదిరిగింది. బండి సంజయ్ కుటుంబ సభ్యులు ములకత్ కోసం ఈరోజు (గురువారం) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అనుమతి ఇస్తే భార్యాపిల్లలతో కలిసి సంజయ్‌ను కలిసే అవకాశాలున్నాయి. బీజేపీ నేతలు కూడా బండి సంజయ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జైలు వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎక్కడా ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు రాకుండా జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
Annamalai: “రాహుల్ గాంధీకి స్వరా భాస్కర్ గులాబీలు ఇచ్చారు”.. సుదీప్ చేరికపై అన్నామలై..

Exit mobile version