Site icon NTV Telugu

Bandi sanjay: కాంగ్రెస్ మునిగిపోయే నావా

Bandi Sanjay Revanthreddy

Bandi Sanjay Revanthreddy

Bandi sanjay: కాంగ్రెస్ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఇవాల ఉదయం జిల్లాలోని 57వ డివిజన్ లో బండి సంజయ్ పర్యటించారు. మోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారు. మీరు కట్టుకున్న ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అన్నారు. ‘‘నేను బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలిస్తే.. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ ఎలా గెలిచారు? అతను అడిగాడు. పొన్నం ప్రభాకర్‌కు అసలు డిపాజిట్‌ వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని బండి సంజయ్ అన్నారు.

Read also: Global Gender: లింగ సమానత్వంలో భారత్‌ స్థానం మెరుగుపడింది

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. మహా జన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. రాష్ట్రంలో ప్రతిరోజూ 35 లక్షల కుటుంబాలను కలువనున్నారు బీజేపీ నేతలు. ఇవాళ పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వరకు అందరూ ఈరోజు తమ నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు. రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలు ఉండగా, ఒక్కో బూత్ కమిటీ అధ్యక్షుడు తమ పోలింగ్ కేంద్రంలో కనీసం వంద కుటుంబాలను కలుస్తారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్ లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్ లోని ప్రజలను బండి సంజయ్ కలుస్తూ నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ.. కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
H-1B Visa: మోడీ పర్యటన వేళ.. భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పనుందా..?

Exit mobile version