Site icon NTV Telugu

Bandi Sanjay: ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్‌ ముందు దీక్ష చేయ్..

Bandi Sanjay Warns Kavitha

Bandi Sanjay Warns Kavitha

Bandi sanjay sensational comments on mlc kavitha: ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేస్తున్న దీక్షకు పోటీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కవితే లక్ష్యంగా కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని బండి సంజయ్ సూచించారు. లిక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారని అన్నారు. సీఎం తీరుతో నే రాష్ట్రంలో మహిళలై వరుస ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. 33 శాతం బీఆర్ఎస్ టికెట్లు మహిళలకు ఇవ్వనందుకు తన తండ్రి కేసీఆర్ ను కవిత ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్ ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని హితవు పలికారు. మహిళా హక్కుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ కేబినెట్‌లో 8 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ 33 శాతం రిజర్వేషన్ గురించి ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ క్యాబినెట్ లో 33శాతం మహిళా మంత్రులు ఎందుకు లేరు? అని నిలదీశారు.

Student Harassment: అనంతపురంలో విద్యార్థినిపై.. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు

మద్యం రేట్లు పెంచిందే కవిత కోసమని బండి సంజయ్ ఆరోపించారు. 40 వేల కోట్ల ఆదాయం లిక్కర్ ద్వారా రాష్ట్రనికి వస్తోందన్నారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ 2 గా ఉందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళల దాడులపై సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారని ఆరోపించారు. కవిత వల్ల మహిళా లోకం తల దించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నాయకులే మహిళలకు శాపంగా మారారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో మహిళా సర్పంచ్ కే రక్షణ లేకుంటే.. సామాన్యల పరిస్థితి ఏంటి? అని బండి సంజయ్ అడిగారు. జాన్సీ లక్ష్మీబాయి, రాణీరుద్రమదేవి మాదిరి కవిత తనను తాను ఊహించుకుంటోందని సెటైర్లు వేశారు. మహిళల రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతకాని తనం వలనే తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయిని బండి సంజయ్ ఆరోపించారు.

Kim Jong Warning: యుద్ధానికి సిద్ధంకండి.. సైనిక డ్రిల్‌లో కిమ్ హాట్ కామెంట్స్

Exit mobile version