Site icon NTV Telugu

Bandi Snajay: చీటర్స్, లూటర్స్ లకు.. ఒక ఫైటర్ కి జరుగుతున్న ఎన్నికలు..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Snajay: చీటర్స్, లూటర్స్ లకు.. ఒక ఫైటర్ కి జరుగుతున్న ఎన్నికలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా ఎస్సారార్ కళాశాలలో బీజేపీ అభ్యర్థి బండిసంజయ్ మార్నింగ్ వాక్ అనంతరం మాట్లాడుతూ.. ఇండియన్ పొలిటికల్ లీగ్ లో మా కెప్టెన్ మోడీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు.

Read also: BRS Foundation Day: నేడు బీఆర్‌ఎస్‌ 24వ ఆవిర్భావ దినోత్సవం..

అసెంబ్లీ ఎన్నికలలొ బీఆర్ఎస్ ని బొందపెట్టారన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత కెసిఅర్ ని పాతాళలోకానికి పాతిపెట్టడం ఖాయమన్నారు. చీటర్స్, లూటర్స్ లకి ఒక ఫైటర్ కి జరుగుతున్న ఎన్నికలు అని తెలిపారు. నాకు ఓటు వేస్తే మోడి ప్రదాని అవుతారు,కాంగ్రెస్ ‌పార్టీ ఓటెస్తే నిరూపయోగమన్నారు. నాలుగు వందల ఏండ్ల కల శ్రీరామ మందిరం కళని మోడీ సాకారం చేసారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ‌ఒప్పందం జరిగిందన్నారు.

Read also: Manipur : మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

బీఆర్ఎస్ పార్టీలో బీఫాం తిసుకొని పార్టీలు మారారని తెలిపారు. వేములవాడ, కొండగట్టు గుడులని ప్రసాద్ స్కీం క్రింద పెట్టి అభివృద్ధి చేస్తానంటే పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఆర్వోబి కోసం బిఆర్ఎస్ లేఖ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆర్వోబి కడుతున్నామన్నారు. కరీంనగర్ స్మార్ట్ కోసం బీజేపీ ‌ప్రభుత్వమే నిదులు‌ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు పోటీ చేస్తున్నాడో, టికెట్ ఏ విధంగా తెచ్చుకున్నాడో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ది మూడవ స్థానం కోసం ,వారి పోటి రెండవస్థానం కోసమే అన్నారు. ఎన్నిలప్పుడే కేసీఆర్ బయటికి వస్తాడన్నారు.
Arvind Kejriwal: ‌కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

Exit mobile version