Bandi Sanjay: పొరపాటున మళ్లీ సీఎం అయితే.. పీఆర్సీ దేవుడెరుగు జీతాలకే ఎసరు పెడతాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఆశ్చర్యపోయే ‘‘పే స్కేల్’’ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా? అని మండిపడ్డారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించి మోసం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, దేశమే ఆశ్చర్యపోయేలా పే స్కేల్ ఇస్తానని సాక్షాత్తు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్… ఇచ్చిన మాట పూర్తిగా తప్పారని మండిపడ్డారు. గడువు ముగిసిన 3 నెలల తరువాత నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించిన కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 శాతం మాత్రమే మధ్యంతర భ్రుతి ఇస్తున్నట్లు ప్రకటించి వారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు 3 డీఏలు (10.92 శాతం) పెండింగ్ లో ఉండగా 5 శాతం ప్రకటించడం హాస్యాస్పదమని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భ్రుతి ఇచ్చిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని పదేపదే మొత్తుకున్న కేసీఆర్… స్వరాష్ట్రం వచ్చాక కేవలం 5 శాతం మధ్యంతర భ్రుతి ఇవ్వడాన్ని ఏమనుకోవాలి? మండిపడ్డారు. కేసీఆర్ పాలనా పుణ్యమా? అని 317 జీవో పేరుతో స్వరాష్ట్రంలోనే ఉద్యోగులు స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా బతుకీడుస్తున్నారని అన్నారు. బదిలీలు, ప్రమోషన్లు లేక అల్లాడుతున్నరని, ఏటా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో పనిభారం ఎక్కువై ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో 5 శాతం మధ్యంతర భ్రుతి ప్రకటించడం.. ఉద్యోగులను మరింత నిరాశ, నిస్ప్రహల్లోకి నెట్టివేయడమే అవుతుందన్నారు. ప్రభుత్వానికి భజన చేసే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని తెలిపారు.
రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచిన కేసీఆర్ పాలనలో ప్రస్తుతం ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితే లేదన్నారు. పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పీఆర్సీ అమలు దేవుడెరుగు 3, 4 నెలలకోసారి జీతాలు కూడా ఇవ్వలేని దుస్ధితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులారా… ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించి ఉద్యోగులకు మేలు కలుగుతుందని వాస్తవాలను గ్రహించాలని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో అంటూ బండి సంజయ్ అన్నారు.
Minister KTR: రైతులకు అన్యాయం జరగకుండా జగిత్యాలలో మాస్టర్ ప్లాన్
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!