Site icon NTV Telugu

Bandi Sanjay: బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటి కాదు.. బిఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే!

Bandi Sanjay Singareni

Bandi Sanjay Singareni

Bandi Sanjay Senational Comments On CM KCR: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి కాదని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే ఒక్కటేనని తెలంగాణ రాష్ట్ర బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎవరు ఎవరితో కలిసి పనిచేశారో చరిత్ర చూడండని చెప్పారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి.. బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. భూపాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కెసిఆర్ మొగోడు అయితే, నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ నుంచి గెలిసొచ్చిన భూపాలపల్లి ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, బిఆర్ఎస్ నుంచి పోటీ చేయించాలని సవాల్ విసిరారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గిందంటూ బీజేపీని పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

CM KCR: ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి.. వారిని స్మరించుకునేందుకే అమరజ్యోతి

బీజేపీ పేరు చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తే, గళ్ళా పట్టి లాక్కొచ్చి గుంజి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. సింగరేణిపై అభిమానం, ప్రేమ ఉంటే.. ఆదాయపరిమితి తగ్గించాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. కేసీఆర్ తనని తాను మోడీతో పోల్చుకుంటున్నాడని.. మోడీకి, కేసిఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇంటింటికి కార్యక్రమంతో 35 లక్షల కుటుంబాలను కలిశామని.. ఏ కుటుంబాన్ని కలిసినా మోడీ ఇచ్చిన పథకాల గురించే చెప్పారని పేర్కొన్నారు. ప్రజల నుంచి లభించిన స్పందన చరిత్రలో రికార్డు సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. దేశంలో మోడీని విమర్శించే రాజకీయ పార్టీలు మూర్ఖులని విమర్శించారు. దేశంలో 12 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మోడీదని చెప్పుకొచ్చారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోంది మోడీనేనని అన్నారు.

Revanth Reddy: బండి సంజయ్‌, కేఏ పాల్ మాటలకి పెద్ద తేడా ఉండదు.. రేవంత్ సెటైర్లు

అన్నింటికీ మోడీ డబ్బులు ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సంక్షేమం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ వ్యాక్సిన్ ‘90 ఎంఎల్’ అంటూ ఎద్దేవా చేశారు. తాము ఏం చేస్తామో చెప్పామని.. మీరేం చేస్తారో చెప్పమని కెసిఆర్‌ని అడిగితే, తోక ముడిచి పారిపోయారని అన్నారు. ఒకప్పుడు కేసీఆర్ కారుని ఫైనాన్స్ వాళ్ళు గుంజుకుపోయారని.. అలాంటి కేసీఆర్ కుటుంబం నేడు కోట్లు సంపాదించుకుందని ఆరోపణలు చేశారు. సింగరేణి వియంలో రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉందని వెల్లడించారు.

Exit mobile version