Site icon NTV Telugu

Bandi Sanjay: చివరి క్షణంలో రద్దైన అమిత్ షా టూర్.. కార్యకర్తలు నిరాశపడవద్దన్న బండి సంజయ్‌

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: చివర క్షణంలో అమిత్ షా పర్యటన రద్దు అయ్యిందని, బీజేపీ కార్యకర్తలు నిరాశ చెందవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతేకాకుండా.. ఖమ్మంలో బహిరంగ సభపై త్వరలో క్లిరిటీ ఇస్తామని తెలిపారు. ఇవాళ (గురువారం) ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. గుజరాత్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బహిరంగ సభ వాయిదా పడింది. 24 గంటల పాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున అనివార్య కారణాల వల్ల బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపగా.. అన్ని రైళ్లను రద్దు చేశారు. ఆ ప్రాంతాల నుంచి దాదాపు 76 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి పరిస్థితిని అంచనా వేశారు. ఈ క్లిష్ట సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సరికాదనే నిర్ణయానికి వచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు. బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. పార్టీ సీనియర్ నేతలంతా అక్కడే స్థిరపడ్డారు. భారీ జనసందోహం కోసం తాను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే అనివార్య కారణాల వల్ల సమావేశం రద్దయింది. త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం ఖాయం. కార్యకర్తలు నిరాశ చెందవద్దని సూచించారు. ఇక 25న నాగర్ కర్నూల్ లో జరిగే నడ్డా సభ యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. మోడీ పర్యటన తేదీపై క్లారిటీ లేదని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందన్నారు.

Read also: Cm Kcr: నాగ్ పూర్ లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై బైపోర్ జాయ్ తుపాన్ ప్రభావం పడింది. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. బిపార్జాయ్ తుఫాను ప్రధానంగా గుజరాత్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అమిత్ షా మరింత దృష్టి సారించాల్సి ఉంది. గుజరాత్‌లో ఇప్పటికే హై అలర్ట్‌ ప్రకటించారు. బిపార్జోయ్ తుఫాను సన్నాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బిఫర్‌జాయ్ తుఫాను 150 కిలోమీటర్ల వేగంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గురువారం మొత్తం అమిత్ షా హైదరాబాద్ లోనే ఉండేలా షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్ లో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉన్నందున పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు

Exit mobile version