Bandi Sanjay Reveals BJP Goal In Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న అన్ని సమస్యలపై బీజేపీ పోరాడుతోందన్నారు. కార్నర్ స్ట్రీట్ మీటింగ్‌లు విజయవంతం అయ్యాయని, ఈ విషయంలో బీజేపీ సెంట్రల్ టీమ్ సంతోషం వ్యక్తం చేసిందని తెలిపారు. ఈరోజు ఢిల్లీలో జరిగింది రొటీన్ సమావేశమని, 15 రోజుల క్రితమే ఈ సమావేశానికి ప్లాన్ చేశారని అన్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సభలు నిర్వహిస్తామని, 10 జిల్లాల్లో పెద్ద సమావేశాలు పెడతామని, ఆ తర్వాత మోడీతో భారీ సభ ఉంటుందని తెలియజేశారు.
Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్‌గా భారీ విగ్రహం
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపిన బండి సంజయ్.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జనం భావిస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వచ్చినా.. కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్‌పై స్పందించిన కేసీఆర్.. కవితపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలనుకునే నాయకులకు బండి సంజయ్ నాయకులకు స్వాగతం పలికారు.
Joginipalli Santosh Kumar: నా జీవితంలో పెట్లబుర్జు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం
ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణకు ముక్తి కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఆక్రోశంతో ఉన్నారని, కేసీఆరర్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఇక ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చ జరిగిందని స్పష్టం చేశారు.