ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, నేతల ఇళ్లతో పాటు వారి సన్నిహితులు ఇళ్లలో కూడా సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ నేతలు స్పందిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడులు చేయిస్తున్నారని బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను దోచుకొని అడ్డంగా సంపాదించిన వారిపైన అధికారులు స్పందిస్తారని, ఫిర్యాదులు అందితే తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుందన్నారు.
Also Read :Cm Jagan on Housing: గృహనిర్మాణశాఖపై జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
అక్రమంగా సంపాదించిన వారిపై అడ్డగోలుగా విమర్శిస్తున్న నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తనిఖీలు చేయాలా వద్దా..? అని ఆయన ప్రశ్నించారు. అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీలకనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదన్నారు. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని, ఇది కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : RC15: ఒక్క షెడ్యూల్ కోసం చరణ్ ఎన్ని లుక్స్ ట్రై చేస్తున్నాడు
తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చని, దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పేదలను అక్రమంగా దోచుకున్న వారిని చూసి చూడనట్లు వదిలిపెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదని, న్యాయ నిపుణులతో ఎదురుదాడిపై స్పందించేందుకు సీఎం వ్యవహరిస్తున్న తీరు తప్పని ఆయన హితవు పలికారు. నోటీసుల జారీపై న్యాయపరంగా కొట్లాడుతామని, న్యాయవ్యవస్థపై మాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.