Cm Jagan on Housing: గృహనిర్మాణశాఖపై జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న గృహాల పథకంపై సీఎం జగన్ (cm Jagan Mohan Reddy)ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్లులేని వారికి అందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు సీఎం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. లే అవుట్లను సందర్శించినట్టు ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయాలన్నారు. ఇకనుంచి ప్రతి శనివారం హౌసింగ్ డే గా పాటించాలన్నారు సీఎం జగన్.
ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని వెల్లడించారు. ఆప్షన్–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని జగన్ సూచించారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్‌ఓపీలను అందుబాటులో ఉంచాలి. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను విస్తృతంగా వాడుకోవాలన్నారు జగన్. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు.
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
Read Also: Pakistan: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని తెలిపారు అధికారులు.ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: RC15: ఒక్క షెడ్యూల్ కోసం చరణ్ ఎన్ని లుక్స్ ట్రై చేస్తున్నాడు
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!