తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర పేరును ఈరోజు ఖరారు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పేరును ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రాజా సంగ్రామ యాత్ర పేరుతో ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను చేపట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పాదయాత్రకు సంబందించిన రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసిన బీజేపీ, యాత్ర పేరు కూడా ప్రకటించడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, 2023లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని నేతలు చెబుతున్నారు.
Read: యాంటీ వ్యాక్స్ నర్సు నిర్వాకం: కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా సెలైన్ ద్రావణం…