Site icon NTV Telugu

Bandi Sanjay: అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భరతమాత ముద్దుబిడ్డ, మృదుస్వభావి, స్థితప్రజ్ఞత కల్గిన ఋషి , దేశం కోసమే జీవించిన తాపసి, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వాజపేయి జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానిగా అటల్ ఎన్నో సాహాసోపేత నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. అటల్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కష్ట పడుతున్నారని అన్నారు.

Read also: Cyber ​​Hackers: లింకులు పెట్టి లక్షణాల్లో లక్షలు కాజేస్తున్న సైబర్ కేటుగాళ్లు

విలువలతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరు అటల్ అని ఎంపీ డా.లక్ష్మణ్ అన్నారు. పార్టీని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన ఘనత వాజపేయ్ ది అని తెలిపారు. తెలంగాణలో ప్రజలను కులం, మతం పేరుతో విడదీసి.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి రాజకీయాలు చేద్దామన్నారు. పాలనలో పారదర్శకత తేవడానికి కృషి చేద్దామన్నారు.
Fake Swamiji: ఓర్నీ.. ఏంది సామీ ఇదీ.. విగ్రహాలను కొట్టేసింది నువ్వేనా!

Exit mobile version