అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భరతమాత ముద్దుబిడ్డ, మృదుస్వభావి, స్థితప్రజ్ఞత కల్గిన ఋషి , దేశం కోసమే జీవించిన తాపసి, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.