Bandi Sanjay: రోడ్డు మీద సిగ్నల్ దగ్గర కూడా సెల్ఫీలు దిగుతా అయితే తనతో నాకు సంబందం ఉందట అఖల్ వుండాలని అనడానికైనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కాగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయరంగు అలుముకుంది. ఇవాల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. అక్కడ బీజేవైఎం నేతల్ని పరామర్శించనున్నారు. కాగా.. క్వశ్చన్ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. అంతేకాకుండా.. దాదాపు ఏడుగురు బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. సీఎం కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. పోలీసులు తప్పు చేసినవాళ్లను వదిలిపెట్టి న్యాయం కోసం పోరాడుతున్నవాళ్లను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు బండి సంజయ్.
Read also: Body Odor : శరీర దుర్వాసన మిమ్మల్ని బాధిస్తోందా.. అయితే చిట్కాలు ఇవే..!
ఈ విషయంపట్ల తొమ్మిది మందితో కూడిన ప్రత్యేక కమిటీని బండి సంజయ్ నియమించారు. అయితే దీనిపై వాస్తవ విషయాలను టాస్క్‌ఫోర్స్ కమిటీ అధ్యయనం చేస్తుంది. కాగా.. ఈ కమిటీ కన్వీనర్‌గా టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌ను నియమించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. రాజు అనే కార్యకర్త చిన్న పిల్లలు ఉన్నారు, నన్ను వదిలిపెట్టండని బ్రతిమిలాడినా పోలీస్ లు కేస్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ ఆయన భయపడడం లేదు కానీ బాధ పడుతున్నారని అన్నారు. మీ బిడ్డకు అక్కడ రేడి అవుతుందని మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. Tspsc లో నమ్మిన వాళ్లు మోసం చేశారంటే నీవెందుకు చైర్మన్ అక్కడా? అంటూ ప్రశ్నించారు. నేరస్థులను కాపాడేందుకే సిట్ వేశారు అంటూ సంచలన ఆరోపనలు చేశారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ కు ఇబ్బంది ఏమి? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకు డ్రామా ఇది అంతా… బట్టబాజ్ గాల్లు అంటూ బండి సంజయ్ తీవ్రంగా ఆరోపణలు చేశారు.
Read also: Big Breaking: చివరి నిమిషంలో ట్విస్ట్.. నేను రాలేనంటూ కవిత లేఖ
కేసీఆర్ స్పందించడు కొడుకును ఏమనడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలు చిన్న చిన్న కంపెనీలు బ్యాక్ గ్రౌండ్ చూసి చేర్చుకుంటారని అన్నారు. 2017 లో TSTS లో ఉద్యోగి ఆయనను TSPSC లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మీద సిగ్నల్ దగ్గర కూడా నేను సెల్ఫి లు దిగుతా ఆయనతో నాకు సంబందం ఉన్నట్టా అంటూ ప్రశ్నించారు. రేణుక అమ్మ brs సర్పంచ్, ఆమె అన్న BRS నేత అంటూ గుర్తుచేశారు. పేపర్ ఎవరి కోసం లీక్ అయింది సిగ్గుండాలి అనడానికి ఆధారాలు ఉంటే బయట పెట్టు అంటూ సవాల్ చేశారు. లీక్ చేసింది Brs, Bjp ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ నోటిఫికేషన్ లు ఇచ్చి బండి సంజయ్ అపారు అంటారు ప్రజలు అన్ని ఆలోచిస్తారని తెలిపారు. కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేస్తావా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రీతి ఆత్మహత్యకు కూడా నేనే కారణం అంటావు? అంటూ ఎద్దేవ చేశారు. కేటీఆర్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసే వరకు వదిలి పెట్టమని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కుటుంబానికి ఒక రూల్…. కవితకు ఒక రూల్ ఇతరులకు ఒక రూల్ ఆ.. మంత్రులు ఆలోచించాలని బండి సంజయ్ అన్నారు.
Body Odor : శరీర దుర్వాసన మిమ్మల్ని బాధిస్తోందా.. అయితే చిట్కాలు ఇవే..!