Site icon NTV Telugu

Bandi Sanjay: సభలో ప్రధానిని ఫాసిస్ట్ అంటే తప్పులేదు.. మరమనిషి అంటే సస్పెండ్ చేస్తారా?

Bandi Sanjay Etala

Bandi Sanjay Etala

Bandi Sanjay is serious about Etala Rajender being suspended: నిండు సభలో కేసీఆర్‌ ప్రధానిని ఫాసిస్ట్ అనుచ్చు కానీ.. ఈటల రాజేందర్ మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. ఇవాళ ఈటెల రాజేందర్‌ ను స్పీకర్‌ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై బండి సంజయ్‌ ఆగ్రమం ఈటల రాజేందర్ అన్నదాంట్లో ఏం తప్పుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామన్నారు బండి సంజయ్‌. నిండు సభలో ప్రధానిని ఫాసిస్ట్ అంటావా..అసలు అసెంబ్లీ నడిపే అర్హత నీకు లేదని మండిపడ్డారు బండిసంజయ్‌. నిన్నే సస్పెండ్ చేయాలని నిప్పులు చెరిగారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో నిన్నే సస్పెండ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళనే మరమనిషి అంటారని మండిపడ్డారు.

read also: Real Estate : రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్ కు కారణమేంటి.? బ్యాంకులు రియల్ సంస్థలకు లోన్లు ఆపేశాయా.?

హామీలను అమలు చేయలేని వాళ్లను మరమనిషి అనడం తప్పా? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ బయట మరమనిషి అన్నందుకే మీకు అంత కోపం వస్తే… అసెంబ్లీలో దేశ ప్రధానిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాసిస్టు ప్రధాని అంటే మాకు కోపం రాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించాల్సిన చోట… రాజకీయాలను చర్చిస్తున్న కేసీఆర్ ను ఏమనాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వేదికగా ఫాసిస్టు ప్రధాని అని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్‌కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే… మాలో ఒక ఎమ్మెల్యేని ఇప్పటికే జైలుకు పంపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేని సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్, కవిత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఆర్టీసీ ఆస్తులను 99 ఏళ్ల పాటు లీజుకిచ్చి, లబ్ది పొందే కుట్రకు తెర లేపారని మండిపడ్డారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా, వాళ్ల ఉసురు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. ఇక్కడ బస్టాండ్ నిర్మిస్తానన్న వాగ్దానం ఏమైంది? అని ప్రశ్నించారు. పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ ఎక్కడికి పోయింది? అని ప్రశ్నల వర్షం కురిపంచారు.
87 Year Old Dials Helpline: హెల్ప్‌ సెంటర్‌కు 87 ఏళ్ల బామ్మ ఫోన్.. మా ముసలోడు ఆగడంలేదని ఫిర్యాదు..!

Exit mobile version