Bandi Sanjay: ప్రశ్నించే గొంతుకను నేను.. కాపాడుకుంటారా? పిసికేస్తారా? అంటూ బీజేపీ కరీంనగర్ అభ్యర్ధి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించి.. శ్రీ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ దీప కాంతుల వెలుగులు మీకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలను అందించాలని అన్నారు. మీ జీవితం ఆనందమయం అవ్వాలని మనసారా కోరుకుంటూ హిందూ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రశ్నించే గొంతుకను నేనని.. అంతిమ నిర్ణయం మీదే అని తెలిపారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ పై యుద్దం చేస్తున్నా అన్నారు. అణిచివేసేందుకు నాపై 74 కేసులు పెట్టిన భయపడలేదని అన్నారు. బీజేపీకి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్నారు. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు జరిగాయి. బండి సంజయ్ ను గెలిపించాలంటూ భారీ ఎత్తున యువకుల ర్యాలీ నిర్వహించారు.
Diwali-PM Modi: సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు!