Bandi Sanjay is angry with CM KCR: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాను ఎగుర వేసిన రాష్ట్ర అధ్యక్షుండు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు. ఆయన నిజాం అనుకుంటున్నాడు.. పక్క దేశాలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. అనేక మంది త్యాగాలతో సాధించుకున్న దేశానికి.. గొప్ప రాజ్యాంగాన్ని అందించారు అంబెడ్కర్ అన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం మనదన్నారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు కల్పించారు అంబెడ్కర్ అని బండి సంజయ్ కొనియాడారు. మోడీ ప్రధాని అవ్వడానికి కారణం రాజ్యాంగమే అన్నారు. దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెడుతున్న వ్యక్తి మోడీ అని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Read also: Raghunandan Rao: ఖమ్మంలో బహిరంగ సభ పెడితే.. కరోనా పాండమిక్ ఉండదా?
ముఖ్యమంత్రికి రాజ్యాంగం, కోర్ట్, మహిళలు అంటే గౌరవం లేదని మండిపడ్డారు. గణతంత్ర వేడుకలు నిర్వహించాలంటే కూడా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సాయుధ దళాల పరేడ్ లేకుండా చేసారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థనే గౌరవించడం లేదు.. మహిళా గవర్నర్ ని కూడా గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబెడ్కర్ ని అవమానిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఇదే గౌరవం ఇస్తావా.? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెట్టిన తరువాత కలిసిన అందరికి ఇదే చెప్పినవా.? వేడుకలు చెయ్యొద్దు అని.! అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. కల్వకుంట రాజ్యాంగాన్ని అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని బండిసంజయ్ హెచ్చారించారు.
Gutha Sukender Reddy: బాధ్యతల్లో ఉన్నవాళ్లే.. తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరం