Bandi sanjay: ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా మెట్ పల్లి టౌన్ లో బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. టి ఆర్ యస్ రద్దుతో తెలంగాణ కు కెసిఆర్ పీడ పోయిందన్నారు. పార్టీ పేరులో తెలంగాణ తీసేసిండు..ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? అని ఆయన ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏం చేసినవో చెప్పాలి. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కేంద్రం రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇచ్చారు కెసిఆర్ డబుల్ బెడ్రూంలు ఇచ్చాడో కేసీఆర్ లెక్క చెప్పాలన్నారు.
Read Also: Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్’ విలన్ పెళ్ళి!
Also Read
హామీలు ఏమి నెరవేర్చావో ముఖ్యమంత్రి చెప్పు.. గుజరాత్ లో ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ముఖ్యమంత్రి బండారం బయట పెడతా. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినవ్ ఇక దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నవా? అన్నారు. మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ ఫ్యాక్టరీ నుండే వస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడడానికి దేశం వదిలిపోయిన వాళ్ళు వేల కోట్ల డబ్బు కెసిఆర్ కు ఫండ్ ఇచ్చారు. విదేశాలకు పోయి వందల మంది జైళ్లలో మగ్గుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం రావాలన్నారు.
తెలంగాణలో రంగు రంగుల జెండాలు పోవాలి… డబుల్ ఇంజన్ సర్కార్ కమలం వికాసించాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అందరికి ఉచిత విద్య వైద్యం అందిస్తాం. నిలువ నీడ లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తాం. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత మోడీదే అన్నారు బండి సంజయ్. ముత్యం పేట ఘుగర్ ఫ్యాక్టరి మీరు తెరిపిస్తారా మేము తెరిపించాలా కేసీఆర్? అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళ గురించి ఒక్క మాట కేసీఆర్ మాట్లాడలేదు.. లండన్ లో తెలంగాణలో కంటేనే కరెంట్ ఉంటుందట. బీజేపీ రాగానే గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం అన్నారు. 30 గ్రామాలకు వాడే కరెంట్ తన ఫామ్ హౌస్‌లో కెసిఆర్ వాడుతున్నారన్నారు. మెట్రో పక్కన తన భూములకు ధరలు రావాలని మళ్ళీ కావాలని అంటున్నాడన్నారు బండి సంజయ్.
Read Also: Hari Pirya: నాని హీరోయిన్ తో ‘కేజీఎఫ్’ విలన్ పెళ్ళి!
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!