NTV Telugu Site icon

Bandi Sanjay: నోరు జారిన బండి సంజయ్.. ఎంత పెద్ద మాట అన్నారు సార్

Bandi Sanjay Tounge Slip

Bandi Sanjay Tounge Slip

Bandi Sanjay Fires On BJP and Congress Parties: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట జారారు. అభ్యర్థులు కరువైన పార్టీ బీజేపీ అంటూ షాకిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ బీజేపీ సీనియర్ కార్యకర్తలలు సమావేశం అయ్యారు. ఈ సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో లేదు, గల్లిలో లేదు, డిపాజిట్ గల్లంతయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అనంతరం.. పోటీ చేయడానికి అభ్యర్థులు కరువైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని కుండబద్దలు కొట్టారు. మాట జారిన అనంతరం తప్పు తెలుసుకున్న ఆయన.. మిస్టేక్‌లో అలా అన్నానని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Komatireddy Venkat Reddy: మంత్రి జగదీశ్‌కి వెంకటరెడ్డి సవాల్.. చేయగలవా?

కాంగ్రెస్, బిఅర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. రెండు పార్టీలు కలిసి అధికారం లో రావాలని చూస్తున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. బిఅర్ఎస్ పార్టీ బలంగా లేని చోట 30 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ.. తమ బీజేపీ మాత్రం ఎన్నికల్లో సింగిల్‌గా దిగుతుందని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నాడని చెప్పారు. ఎంఐఎం సైతం వారికే మద్దత్తు ఇస్తున్నారన్నారు. సింగిల్‌గా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీ సిద్దంగా ఉందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు సిద్ధాంతాలు లేవన్నారు. దోచుకోవడం బీఆర్ఎస్ సిద్ధాంతమైతే.. దేశద్రోహులతో స్నేహం చేయడం కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు.

Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధరలు..!