Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది: బండి సంజయ్‌

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడులకు తెగబడుతుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు.

Read Also: నా ఎలక్షన్‌ అఫిడవిట్‌ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రంలో విలేకరులు, కవులు, ప్రజాప్రతినిధులపై దాడులు జరగుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని బండి సంజయ్‌ ఖండించారు. అరవింద్ పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై సమావేశం నిర్వహించింది. రేపు అన్ని జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. అంతకుముందు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… నాపై పోలీసులు ప్లాన్ ప్రకారం దాడి జరిగిందంటూ విమర్శించారు. దాడి గురించి ముందస్తు సమాచారం అందించినా.. పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. తమపై దాడులు చేసింది రైతులు కాదని…టీఆర్ఎస్ గుండాలని విమర్శించారు.

Exit mobile version