Bandi Sanjay Comments On CM KCR Government: ఎకరానికి రూ.10 వేలు ఇస్తానంటూ మార్చిలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాకపోవడం సిగ్గుచేటు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలోనూ ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనపడుతోందని ఆరోపించారు. జలమండలి వద్ద ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాల్లో, నీటి గుంతల్లో పడి పిల్లలు చనిపోతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ ప్రాంతంలో నీటి గుంతలో పడి వివేక్ అనే చిన్నారి చనిపోవడం అత్యంత బాధాకరం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పసిపిల్లలు బలవుతుంటే మునిసిపల్ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్‌లో ఉండేది
అకాల వర్షాలకు భాగ్యనగర్ ఆగమవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని బండి సంజయ్ అడిగారు. జీహెచ్ఎంసీ, జల మండలి తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానలతో రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయి లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఎందుకు వారిని ఆదుకోవడం లేదని పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఎకరానికి సగటున రూ.50 వేలు నష్టపోయారన్నారు. కానీ.. ఇప్పటిదాకా పైసా కూడా సాయం చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మార్కెట్లకు వచ్చిన ధాన్యం కూడా వర్షాలకు తుడిచిపెట్టుకు పోతుంటే.. వ్యవసాయ శాఖ మొద్దు నిద్దురపోవడం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రతిసారి చెబుతున్నా.. ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యల్లేవని ధ్వజమెత్తారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
Bajrang Dal: భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ.. ప్రధాని మోడీ విమర్శలు..
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోందని, ర్రాష్ట్ర పభుత్వం మాత్రం సరైన చర్యలు చేపట్టకపోవడం క్షమించరాని నేరమని బండి సంజయ్ అన్నారు. రబీ సీజన్ లో అకాల వర్షాల వల్ల రైతాంగంపై కోలుకోలేని దెబ్బపడిందని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు వానా కాలం సీజన్ లో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను అందజేయాలన్నారు. ఏళ్ల తరబడి రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోతున్నా.. సమగ్ర పంటల బీమా విధానాన్ని తీసుకురాకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు వర్తింప చేసి ఉంటే.. రైతులకు సాయం అందేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని.. యుద్ద ప్రాతిపదికన సమగ్ర పంటల బీమా విధానాన్ని అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.