NTV Telugu Site icon

Bandi Sanjay: మోటార్లకు మీటర్లపై.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay Challenges Kcr

Bandi Sanjay Challenges Kcr

Bandi Sanjay Challenges CM KCR On Meters For Motor: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మోటార్లకు మీటర్ల విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సవాల్ విసిరారు. ‘‘రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మీకు లోన్ ఇవ్వండి అని కేంద్రానికి ఉత్తరం రాసింది నువ్వు కాదా? నువ్వు మగాడివి అయితే నిజం చెప్పు’’ అని ఛాలెంజ్ చేశారు. జయశంకర్ జిల్లాలో మంథనిలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావు సస్యశ్యామల యాత్ర చేపట్టారని, బీజేపీకి యాత్రలు కొత్త కాదు అని అన్నారు. ఆనాడు నక్సలైట్లు భయపెట్టినా, నేడు పోలీసులు భయపెడుతున్నా.. బీజేపీ యాత్రలు ఆగవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు కోట్లు సంపాదించుకున్నాడని ఆరోపణలు చేశారు. బీజేపీ పేరు చెప్పి సింగరేణిని కేసీఆర్ ప్రైవేటీకరణ చేస్తే.. గల్లా పట్టి కొడుతామని అన్నారు. సింగరేణి కేసీఆర్ సర్కారుకు ఏటీఎమ్ అయ్యిందన్నారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు.

Case Of Husband Against Wife: అది మర్చిపోయిన భర్త.. శివాలెత్తిన భార్య.. కట్ చేస్తే..

ఇక కేటీఆర్ తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చారని, కేసీఆర్ పేరు పక్కకుపెడితే కుక్కలు కూడా కేటీఆర్‌ని చూడవని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను దేశం కోసం, ధర్మం కోసం జైలుకు వెళ్లినవాడినని.. సామాన్య కార్యకర్తగా ఎవరి అండదండలు లేకుండా ఎదిగానని అన్నారు. బీజేపీ కుటుంబాల పార్టీ కాదన్న ఆయన.. సామాన్య కార్యకర్త అయిన మోడీ ఇప్పుడు ప్రధాని అయ్యారన్నారు. ‘‘నీ కొడుకు, కూతురు కాకుండా వేరే వ్యక్తులను పార్టీ అధ్యక్షుడు చేసే ధైర్యం ఉందా’’ అంటూ కేసీఆర్‌కు మరో సవాల్ విసిరారు. కేసీఆర్‌వి అన్నీ దొంగ దీక్షలే అని.. ఉద్యమ సమయంలో తిని, తాగి దొంగ దీక్ష చేశాడని విమర్శించారు. ఢిల్లీలో చేసిన దీక్షలోనూ కేసీఆర్ మందు తాగారంటూ వ్యాఖ్యానించారు. ఒక తాగుబోతుని ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఏడాది.. ఈ కాష్టం చల్లారదా?

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని బండి సంజయ్ పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తోందన్నారు. కానీ, ఇవన్నీ తామే ఇస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని వాపోయారు. అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసును ప్రభుత్వం మూసి వేయాలని చూస్తోందని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ కేసును రీ ఓపెన్ చేసి, హంతకులకు శిక్ష పడేలా చేస్తామని అన్నారు. కవితకు దొంగసారా వ్యాపారం చేయడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రం డబ్బులు లేవా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Harmanpreet Kaur: రనౌట్ వివాదం.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్