Harmanpreet Kaur Gives Counter To Nasser Hussain: టీ20 మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో.. హర్మన్‌ప్రీత్ రనౌట్ అయిన తీరు చర్చనీయాంశంగా మారింది. బ్యాట్ స్టక్ అవ్వడంతో.. ఆమె క్రీజుకి చేరుకోలేకపోయింది. దీంతో.. రనౌట్‌గా వెనుదిరిగింది. ఈ పరిణామాన్ని చాలామంది దురదృష్టకరంగా భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ మాత్రం వ్యంగ్యంగా మాట్లాడాడు. ‘పరిణతి లేకుండా చిన్న పిల్ల మాదిరి ఏంటిది’ అని అర్థం వచ్చేలా ‘స్కూల్ గర్ల్ ఎర్రర్’ అంటూ పేర్కొన్నాడు. ఇంత సిల్లీగా ఎవరైనా ఔటవుతారా? అని లైవ్‌లో కామెంట్ చేశాడు. ఇందుకు హర్మన్‌ప్రీత్ తాజాగా కౌంటర్ ఇచ్చింది.
Couple Stuck In Lift: లిఫ్టులో చిక్కుకున్న కొత్త జంట.. ఆ తర్వాత ఏమైందంటే?
హర్మన్ మాట్లాడుతూ.. ‘‘అవునా, ఆయన అలా అన్నాడా! నాకైతే ఆ విషయం తెలియదు కానీ, అది ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనం. క్రికెట్‌లో ఇలాంటి పరిణామాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పరుగులు తీస్తున్నప్పుడు.. సింగిల్ పూర్తయ్యాక రెండో పరుగు కోసం ప్రయత్నించినప్పుడు బ్యాట్ అనుకోకుండా అక్కడ స్టక్ అయ్యింది. నిజంగా ఇది దురదృష్టకర పరిణామం. ఆ మ్యాచ్‌లో మేము మరీ అంత చెత్తగా ఆడలేదు. కొన్నిసార్లు బౌలింగ్ బాగా వేస్తే, మరికొన్ని బ్యాటింగ్ సరిగ్గా ఆడకపోవచ్చు. మేమైతే సెమీస్‌లో మంచి ప్రదర్శనే కనబరిచాం. కానీ, దురదృష్టవశాత్తూ ఓడిపోయాం. ఇక రనౌట్ విషయానికొస్తే.. నాసిర్ అన్నట్లు అదేమీ స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదు. మేము పరిణతి కలిగిన ఆటగాళ్లమే. ఆయనలా ఆలోచిస్తే నేనేమీ చేయలేదు. కచ్చితంగా అది స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదని మాత్రం చెప్పగలను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Bus Robbery: సినిమా స్టైల్‌లో బస్సులో 10 లక్షల దోపిడీ.. బైక్‌తో అడ్డగించి మరీ..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి మొదట్లో గట్టి దెబ్బలు తగిలినా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా రోడ్రిగ్స్, ఐదో స్థానంలో వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం బాగా రాణించారు. అయితే.. 14.4 వోర్ వద్ద హర్మన్ దురదృష్టకర రీతిలో రనౌట్ అయింది. సింగిల్ పూర్తి చేసి, మరో పరుగులు తీసేందుకు ప్రయత్నించగా.. సరిగ్గా క్రీజు వద్ద బ్యాట్ స్టక్ అయ్యింది. అప్పటికే బంతిని అందుకున్న హేలీ, బెయిల్స్‌ని పడగొట్టడంతో హర్మన్ రనౌట్ అయ్యింది. ఆఖరి వరకు పోరాడిన టీమిండియా.. చివరికి 5 పరుగుల తేడాతో ఓడిపోయి, ఇంటిబాట పట్టింది.