NTV Telugu Site icon

Bandi v/s Ktr: కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్.. నీకు దమ్ముంటే ఆ సర్టిఫికెట్స్‌ బయటపెట్టు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay challenge to KTRr: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డిగ్రీ సర్టిఫికెట్ల వార్ జరుగుతుంది. ట్విటర్‌ వేదికగా ఒకరినొకరు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రధాని మోడీ టార్గెట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్ట్వి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రం వేసిన విషయం తెలిసిందే. బీజేపీలో చాలా మున్నాభాయ్, ఎంబీబీఎస్ రకాలు ఉన్నట్లు కనిపిస్తోందని ట్విటర్ చేయగా దీనిపై ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ పై బీజేపీ రాష్ట అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ మండిపడ్డారు. దమ్ముంటే నీ అయ్య (సీఎం కేసీఆర్‌) ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టాలని సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే… కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బీరు…రమ్… స్కాచ్ పార్టీ అని, కేసీఆర్ కుటుంబం మీరంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు. 8 ఏళ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని కేసీఆర్ నేడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తదితురులతో కలిసి పరేడ్ మైదానానికి వచ్చిన బండి సంజయ్ ఈనెల 8న సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఉదయం 10.30 గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయానికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఈనెల 8న వందేభారత్ రైలు ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారని, ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నామని ప్రజలకు పిలుపు నిచ్చారు. కేసీఆర్ కుటుంబానికి ఏం పనిలేదు… కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ బాగా చదువుకున్నారు కదా… దేనికి ఉపయోగపడింది. డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు, కమీషన్లు తీసుకోవడానికే ఉపయోగపడింది. చదువుకున్న అజ్ఞానులు మీరు అంటూ మండిపడ్డారు. మోడీ సమాజాన్ని చదివిన వ్యక్తి. దేశాన్ని అభివ్రుద్ది బాటలోకి తీసుకెళ్తున్నారని, ప్రపంచంలోనే భారత్ ను 5 వ స్థానానికి తీసుకొచ్చారని బండి సంజయ్‌ అన్నారు. 80 వేల పుస్తకాలు చదువుకున్న మీ అయ్య చదువు ఏమైంది? ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చదివినని మీ అయ్య చెప్పిండు…. నీకు చేతనైతే ముందు ఆ సర్టిఫికేట్ ను బయట పెట్టు చూద్దాం మని సవాల్‌ విసిరారు. KCR దొంగ పాస్ పోర్ట్, దొంగ సర్టిఫికెట్స్ తయారు చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్లున్నారని ఆరోపించారు. మిగులు రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: SSC Hindi Paper Leak: వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం

బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా అని, స్కీంల ద్వారా ఏ విధంగా స్కాంలు చేయాలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ బీఆర్ఎస్ భవన్. బీఆర్ఎస్ అంటేనే బీరు, రమ్ము, స్కాచ్ పార్టీ అన్నారు. కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే.. ఆయన తాగి పడుకుంటడు.. అన్నీ లీకులే. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వం. లీకుల జాతర నడుస్తోంది. అవినీతి సొమ్ముతో పొట్టుపొట్టు పైసలు సంపి విదేశాల్లో పెట్టుబడి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్….8 ఏళ్ల క్రితం నీ బతుకేంది. నందినగర్ లో ఓ ఇల్లు మాత్రమే ఉండే . నీ బిడ్డకు అపార్ట్ మెంట్లో అద్దెకుంది. నీ కొడుకుకు ఇల్లేలేదు. ఇప్పుడు వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్? రాష్ట్ ప్రజల భవిష్యత్ ఎట్లా అంధకారమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీ దిక్కుమాలిన పాలనలో అన్నీ లీకులే.. కాళేశ్వరం పంపులు లీకేజే… డబుల్ బెడ్రూం ఇండ్ల లీకేజే… ధరణి పోర్టల్ భూముల వివరాలన్నీ లీకులే… టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకులే..అని ఎద్దేవ చేశారు. టెక్నాలజీలో నేను తోపుని చెప్పుకుంటున్న కేసీఆర్ కొడుకు ఏం చేసిండు.. టెక్నాలజీని ఎట్లా లీక్ చేయాలి? దొంగలంతా ఎట్లా టెక్నాలజీని లీక్ చేయాలో నేర్పుతుండా? అంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేతకాదు.. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ట్రిపుల్ ఐటీని నిర్వీర్యం చేశారు. పురుగుల అన్నం తిన్పిస్తున్నరు. ఉద్యోగాల నిర్వహణ చేతగాదంటూ మండిపడ్డారు. మరి కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఎక్కడైనా పొరపాటు జరిగిందా? మరి ఇక్కడెందుకు లీకులైతున్నయో సమాధానం చెప్పాలని సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రపంచంలోని అన్ని పార్టీలకు నాయకుడయ్యేంత డబ్బును విపరీతంగా సంపాదించాడు. రాజ్ దీప్ సర్దేశాయ్ బీజేపీ లీడర్ కాదు.. దేశంలోని బీజేపీని ఓడగట్టానికి ప్రతిపక్షాలన్నింటికీ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టే స్థాయికి కేసీఆర్ వచ్చాడు.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బతకనీయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అభివ్రుద్ధి ఏంది?…టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేయడమా? కొడుకును, అల్లుడును మినిస్టర్ చేయడమా? కూతురుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమా? ఆడవారిపై బిఆర్ఎస్ నాయకుల అఘాత్యాలే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి. తెలంగాణ సొమ్మును దోచుకుని దాచుకోవడమే టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి. పేపర్ లీకులతో నిరుద్యోగుల పొట్ట కొట్టడమే బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి.

Read also: Ganta Srinivasa Rao and Buddha Venkanna: మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.. బెదిరింపుల నుంచి బుజ్జగింపులకు తగ్గారు..!

జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఉద్యోగులను వేధించడమే బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి అంటూ ఎద్దేవ చేశారు. కేసీఆర్ అనేటోడు మనిషే కాదు… ఇంటర్మీడియట్ విద్యార్థులు చస్తే పట్టించుకోని మూర్ఖుడు. టెన్త్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకవుతున్నా నోరు మెదపరు… సిగ్గుండాలే… పేపర్ లీకేజీ కాకుండా అడ్డుకోలేని నిన్ను సీఎంగా ఎట్లా గుర్తించాలి. లీకేజీలో అందరూ బీఆర్ఎసోళ్లే. ఇంకెన్ని పేపర్లు లీకేజీలు కావాలో.. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నవ్. అవినీతి సొమ్ముతో నాశనం చేస్తున్నవ్. కేసీఆర్ చేసేవన్నీ కొంపలు ముంచే రాజకీయాలే… బీఆర్ఎస్ అంటే…. బీరు, రమ్ము, స్కాచ్ పార్టీ నీది… సభ పెడితే మందుపోసే పార్టీ అంటూ సంచలన వ్యఖ్యలు చేశారు బండి సంజయ్‌. పదవుల్లేకుంటే బతకలేవా? ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటావ్? వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలి. లేకుంటే కొడుకును బర్తరఫ్ చేసి మెడలు పట్టి గెంటేయాలి. ఒక్కసారైనా నువ్వు రివ్యూ జరిపినవా? నువ్వు కూడా రాజీనామా చేయాలి. విద్యా మంత్రిని రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీపై బాధ్యులను శిక్షించే వరకు బీజేపీ పోరాడుతుంది.

అందులో భాగంగా త్వరలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలో వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నాం. మిగిలిన ఉమ్మడి జిల్లాలన్నింట్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. అట్లాగే త్వరలోనే రాష్ట్ర రాజధానిలో లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్, బహిరంగ సభ నిర్వహిస్తాం. ఈ లీకేజీతోనే కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడం (పీకుడు) గ్యారంటీ అంటూ బండిసంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఒక అంతర్జాతీయ దొంగల ముఠా. సారా, డ్రగ్స్, ల్యాండ్ దందాలే ఆ పార్టీ నినాదం. స్కీముల పేరుతో స్కాములు ఎలా చేయాలో నేర్పించే సంస్థ BRS భవన్. BRS అంటే బీరు రమ్ము స్కాచ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాలో త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. లక్షలాది మందితో రాజధానిలోనూ సభ, మార్చ్ నిర్వహిస్తామన్నారు బండి సంజయ్‌.
Kunamneni Sambasiva Rao: కక్కుర్తి పడి ఇక్కడ ఎవరు లేరు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు..

Show comments