Bandi Sanjay: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. సీఎం కేసీఆర్ వచ్చేవరకు కామారెడ్డి కలెక్టరేట్ నుంచి కదిలేదిలేదని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.. దీంతో, బండి సంజయ్, కొందరు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, బండి సంజయ్‌ను పోలీస్ వాహనంలో ఎక్కించి పీఎస్‌కు తరలించే ప్రయత్నం చేయగా.. ఆ వాహనాన్ని అడ్డుకున్నారు కార్యకర్తలు.. పోలీస్ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు.. ఈ ఘటనలో పోలీస్ వాహనం అద్దాలు పగిలాయి. పోలీస్ వాహనంపై దాడి , కలెక్టరేట్ లోకి దూసుకెళ్లిన ఘటనలో మరికొందరు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..
Read Also: MLC Kavitha: కేసీఆర్ గన్ అయితే.. ఉద్యోగులు బుల్లెట్లు..
అయితే, అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులతో తోపులాటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.. పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట జరిగి ఉద్రిక్తతంగా మారింది.. కలెక్టరేట్ ముందు ఉన్న బారికేట్లు తోసేసి కార్యాలయం గేట్లు ఎక్కేందుకు యత్నించారు.. వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. కాగా, సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చేదాకా కలెక్టర్ కార్యాలయం వద్దే కూర్చాంటా అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు.. కామారెడ్డి రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమంలో పాల్గొంటాం అన్నారు.. రైతు రాములు ఆత్మహత్య తెలంగాణ రైతాంగాన్ని కలిచి వేసింది.. అడ్లూరి రైతు రాములుది పేద కుటుంబం, రెండు ఎకరాలు ఇండస్ట్రీ జోన్ లో పోతుందని బాధపడ్డాడని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రియల్ జోన్ కు బీజేపీ గాని, కామారెడ్డి ప్రజలు గాని వ్యతిరేకం కాదు.. కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. ఇక, అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు బండి సంజయ్.. రైతులను కలిసి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాస్టర్ ప్లాన్ చేసి రైతుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు.
