NTV Telugu Site icon

Banda Prakash: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక.. బండా ప్రకాష్ నామినేషన్

Ktr

Ktr

Banda Prakash: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఓరుగల్లుకు దక్కనుంది. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇవాల నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. 12న మండలిలో డిప్యూటీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఇవాళ ఉదయం అసెంబ్లీ ఛాంబర్‌లో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. బీఆర్‌ఎస్ తరఫున ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్ బలం దృష్ట్యా ఈ పదవికి ఆయన ఎన్నిక లాంఛనమే అని పార్టీ పార్టీవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులకు సమర్పించిన ఎమ్మెల్సీ బండ ప్రకాష్. ఈకార్యక్రమంలో.. మంత్రుల కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పలువురు నేతలు పాల్గొన్నారు.

రాజకీయాల్లో బండా ప్రకాశం..

1981లో మున్సిపల్ కౌన్సిలర్ రాజకీయ రంగం లో అడుగుపెట్టిన డాక్టర్ బండా ప్రకాశ్ రాజకీయాల్లో అంచెలంచె లుగా ఎదిగారు. 1971-72లో ఏవీవీ జూనియర్ కళాశాల స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1972 నుంచి 75 వరకు వరంగల్ సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్టూడెంట్ కో-ఆ ర్డినేషన్ చైర్మన్ గా పని చేశారు. 1981లో ఎంఏ (పబ్లిక్ అడ్మిస్ట్రేషన్)లో యూనివర్సిటీ మొదటి ర్యాంకు బంగారు పతకం పొందారు. 1995లో పీ హెచ్ డి చేశారు. 1981-84 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్, వైస్ చైర్మన్, 1982-83, 1984-85 ‘కుడా’ సభ్యులుగా కూడా పని చేశారు. పలు స్వచ్ఛంద, విద్యా, కార్మిక, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా సంస్థ లకు గౌరవ అధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు.

టీఆర్ఎస్ లో చేరిన డాక్టర్ బండా ప్రకాశ్ 2017లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ప్రధాన కార్యద నియమితులయ్యారు. పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్త ఆయనను కేసీఆర్ ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. 2018 మార్చి 23న పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018-2019 వరకు ప్రాచీన స్మారక కట్టడాలపై రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా, 2019లో రాజ్యసభలో కార్మిక చట్టాలు- సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2019 జూన్ లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పక్ష ఉప నాయకుడిగా నియమితులయ్యారు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో 16 నవంబర్ 2021న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య ర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నియ్యారు. డిసెంబర్ లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 12న జరిగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం బండా ప్రకాశ్ పేరును ఖరారు చేసింది.
Telangana Budget: నేటితో బడ్డెట్‌ పద్దులపై శాసనసభలో ముగియనున్న చర్చ