Site icon NTV Telugu

Balmoori Venkat: తప్పుడు ప్రచారాలు చేయకండి.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్..

Balamoori Venkat

Balamoori Venkat

Balmoori Venkat: కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్దమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలని డిమాండ్ చేశారు. సీఎంపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్సీ వెంకట్ క్షమాపణ చెప్తానని తెలిపారు. సీఎంపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్దం అన్నారు. కేటీఆర్ చేస్తున్న ప్రచారాలు అబద్దమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టి దుమ్మెత్తి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్

తప్పుడు పత్రాలు సృష్టించి బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్స్ లలో పెట్టి నిజమని నమ్మిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించండి అంతేగానీ.. తప్పుడు ప్రచారాలు చేయకండి అన్నారు. గురుకుల, AEE అభ్యర్థులు ఆందోళన పడకండి అని తెలిపారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. పదిహేను రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి సరి చేస్తున్నామన్నారు. ఒక్క ఇబ్బంది కలగకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామన్నారు. NEET పై హైదారాబాద్ వేదికగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
Air Pollution : విషపూరిత గాలి పీల్చి 13కోట్ల మంది మృతి.. అధ్వాన్నంగా చైనా, భారత్ పరిస్థితి

Exit mobile version