Air Pollution : మానవ నిర్మిత ఉద్గారాల కాలుష్యం, అడవి మంటలు వంటి వాటి వల్ల 1980 – 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా 135 మిలియన్ల అకాల మరణాలు సంభవించాయని సింగపూర్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ 40 ఏళ్లలో కర్బన ఉద్గారాలు, అడవుల్లో మంటలు వంటి సంఘటనలు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి. ఎల్ నినో, హిందూ మహాసముద్రం డైపోల్ వంటి వాతావరణ సంఘటనలు గాలిలో ఈ కాలుష్య కారకాలకు పెంచాయని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (NTU) తన పరిశోధకులు నిర్వహించిన అధ్యయన ఫలితాలను విడుదల చేసింది.
Read Also:Euphoria : గుణశేఖర్ ‘యుఫోరియా’కు మ్యూజిక్ అందించనున్న ఆ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..?
నయం చేయలేని రోగాలు
వాయుకాలుష్యం ప్రస్తావన రాగానే సహజంగానే పీఎం 2.5 అంశం గుర్తుకు వస్తుంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (PM 2.5) పిలువబడే సూక్ష్మ కణాలు మానవ ఆరోగ్యానికి హానికరం. వాటిని పీల్చినప్పుడు నేరు రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఇవి వాహనం, పారిశ్రామిక ఉద్గారాలు, అలాగే మంటలు, దుమ్ము తుఫానుల వంటి సహజ వనరుల నుండి వస్తాయి. వీటి కారణంగా సంక్రమించే రోగాలు నయం చేయలేనివిగా మారుతున్నాయి. దీంతో అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలో పేర్కొన్నారు. కాలుష్యం వల్ల కలిగే అసలైన సమస్య ఏమిటంటే, దాని బారిన పడిన వ్యక్తుల ఆయుర్దాయం క్రమంగా తగ్గుతోంది.
Read Also:SA vs BAN: గెలిచే మ్యాచ్‌లో ఓటమి.. టీ20 ప్రపంచకప్ 2024లో వివాదం!
భారత్, చైనాలోనే అత్యధిక మరణాలు
ఇలాంటి పరిస్థితుల్లో వాయుకాలుష్యంతో గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ తదితర వ్యాధులు మరింత ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాయు కాలుష్యం దుష్ప్రభావాల కారణంగా చికిత్స పొందగలిగే వ్యాధులు నయం కావు. సింగపూర్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. PM 2.5 కారణంగా అత్యధిక మరణాలు ఆసియాలో సంభవించాయి. ఆసియాలో దాదాపు 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కూడా అత్యధిక మరణాలు చైనా, భారతదేశంలోనే సంభవించాయి. భారతదేశం, చైనాతో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, జపాన్లలో కూడా ప్రజల అకాల మరణాలు పెద్ద ఎత్తున సంభవించాయి. ఈ దేశాల్లో మరణించిన వారి సంఖ్య 20 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే వాతావరణంలో మార్పులు విషపూరిత గాలి కారణంగా మరణాలను 14 శాతం పెంచాయి.