తెలంగాణ బీజేపీ ఎంపీలు సభ్యత… సంస్కారం లేకుండా మాట్లాడారు… దానిని ఖండిస్తున్నాము అని బాల్క సుమన్ అన్నారు. ధర్మపురి అరవింద్ ఒక బజారు మనిషిలా మాట్లాడారు… ఆయనో దగుల్బాజీ. ఇదే పద్ధతిలో ఉంటే తెలంగాణ రైతులు మిమ్మల్ని బట్టలు ఊడదీసి కొడతారు. తెలంగాణ రైతులపై బీజేపీ కక్ష కట్టిన్నటు కనిపిస్తుంది. వడ్లు కొంటరా.. కొనరా మాట్లాడకుండా… సీఎం కేసీఆర్ పై అడ్డం దిడ్డంగా మాట్లాడుతున్నారు అని తెలిపారు. పసుపు బోర్డు తేలేని సన్నాసి ధర్మపురి అరవింద్అని చెప్పిన ఆయన… పార్లమెంట్ సభ్యులలా కాకుండా పనికిరాని వాళ్ళల బీజేపీ ఎంపీలు మాట్లాడ్తున్నారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా మాట్లాడకపోతే… మీ పని చెప్తం. చేతగాని మంత్రి కిషన్ రెడ్డి , బీజేపీ ఎంపీలు అని తెలంగాణ ప్రజలు అంతా అంటున్నారు. తెలంగాణ బీజేపీలో చిల్లర గాళ్ళు తయారు అయ్యారు అని తెలిపారు. కేసీఆర్ ఒక్క ఇషారా చేస్తే… మీ పని అయితది.. బలిసి మాట్లాడుతున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. బండి సంజయ్, అరవింద్ మాటలను తెలంగాణ సమాజం ఖండించాలి. హైదరాబాద్ పై బీజేపీ కుట్ర చేస్తుంది. తెలంగాణ… గుజరాత్ ను ఎక్కడ దాటి పోతుందో అని ఢిల్లీ డైరెక్షన్ ప్రకారం ఇక్కడి నేతలు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు.