NTV Telugu Site icon

Balka Suman: కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రబాబుకి వేసినట్టే.. బాల్క సుమన్ ఫైర్

Balka Suman

Balka Suman

Balka Suman Fires On Revanth Reddy Congress Party: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు పక్కనున్న దొంగ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే, చంద్రబాబుకి ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో పోడు భూములు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే, రూ.4 వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ మాయమాటలు చెప్తోందని, దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసులు, గిరిజనలు తమ హక్కులు అడిగితే.. గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని విమర్శించారు.

Rape And Kidnap: మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేసిన తాంత్రికుడు..!

50 ఏళ్ళు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని బాల్క సుమన్ ప్రశ్నించారు. గిరిజనులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్లలో విపక్ష నాయకులు ఆస్తులు, అంతస్తులు పెంచుకున్నారే గానీ.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. విపక్షాల దొంగ ప్రేమ, కపట ప్రేమను నమ్మొద్దని ప్రజల్ని సూచించారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే.. అక్కడ కేసీఆర్ సార్, ఇక్కడ బాల్క సుమన్ గెలుపొందాలని అన్నారు. కరోనా సమయంలో మోడీ సర్కార్ సహకరించకపోయినా.. కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. కల్లోలితో తెలంగాణ కాదు, బంగారు తెలంగాణ కావాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన.. గిరిజన సంక్షేమానికి ఒక స్వర్ణయుగమని అభివర్ణించారు.

Ponguleti Srinivas Reddy: 100 సీట్లతో గెలుస్తాం.. బీఆర్ఎస్‌ని ఓడిస్తాం

దశాబ్దాలుగా అడవి తల్లిబిడ్డలు గుట్టలను చదును చేసి, పోడు భూములను సాగు భూములుగా మలుచుకున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా హక్కులు దక్కలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ వారి గోడు విని, రాష్ట్రవ్యాప్తంగా 1,51,146 మంది పోడు రైతులకు పట్టాలు అందజేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. 128 జిల్లాల పరిధిలో 1,51,148 మంది లబ్దిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులని ప్రభుత్వం గుర్తించిందని, వారందరికీ ఈ వానాకాలం సీజన్ నుండే రైతుబంధును అందించనున్నదని పేర్కొన్నారు. గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. గిరిజనులపై ప్రేమను, చిత్తశుద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం చాటుకుందని చెప్పుకొచ్చారు.