NTV Telugu Site icon

Balka Suman : గుజరాత్ గులాంల తెలంగాణ వద్దు.. గులాబి తెలంగాణ కావాలి

బండి సంజయ్ పాదయాత్ర ఇక్కడ చేసుడు కాదు ఢిల్లీ యాత్ర పెట్టి తెలంగాణ కు రావాల్సిన నిధులు తెప్పించు అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు. సీఎం కేసీఆర్‌కు రైతు కృతజ్ఞత సభను సోమవారం చెన్నూరులో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. బీజేపీ లీడర్ల కొడుకులు ఏసీ ల్లో ఉంటారు.. సాధారణ బీజేపీ కార్యకర్తలు వారి కొడుకులు లొల్లి పెట్టుకొని, సోషల్ మీడియాలో పోస్టు లు చేసి బలి కావాలా అని ఆయన ప్రశ్నించారు. సాధారణ బీజేపీ కార్యకర్త లు ఆలోచించాలని, హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి బీజేపీకి తాకట్టు పెట్టాడని ఆయన విమర్శించారు.

మళ్లీ అట్లనే బీజేపీకి తాకట్టు పెట్టే పని లో ఉన్నాడన్నారు. గుజరాత్ గులాంల తెలంగాణ వద్దు.. గులాబి తెలంగాణ కావాలని ఆయన వ్యాఖ్యానించారు. దానికి ప్రజలంతా అండగా ఉండాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. చెన్నూర్ నుంచి ఇదివరకు గెలిచిన వారు మంత్రి పదవులు పొందారు తప్పా రైతులకు సాగు నీరు ఇవ్వలేదన్నారు. మే నెలలో చెన్నూర్ నియోజక వర్గంలో సీఎం కేసీఆర్ పర్యలించనున్నట్లు ఆయన తెలిపారు.