ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బలగం’ మూవీ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఊళ్లలో పంచాయితీల వద్ద ప్రత్యేక తెరలను ఏర్పాటు చేసి మరీ ఈ బలగం సినిమా ను గ్రామాల్లో ప్రదర్శించి ఉచితంగా చూపించారు.ఈ సినిమాను చూసి కంటతడిపెట్టనివారు లేరు. బంధాలు, బంధుత్వాల విలువలు గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు. దీంతో ఈ సినిమా ప్రభావం జనాల పై బాగా పనిచేసింది.విడిపోయిన చాలా బంధాలు ఒకటయ్యాయి. ఇలాంటి వర్తలు మూవీ రిలీజ్ టైం లో వరుస పెట్టి వచ్చాయి. ఇందులో భాగంగా తాజాగా 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి మాట్లాడుకున్నారు అన్నదమ్ముళ్లు.
Also Read: Kannappa: మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్..
అవును రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, కొలనూరు గ్రామంలో అన్నదమ్ములు మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు చిన్న చిన్న విభేదాలతో 10 ఏళ్ల కింద విడిపోయారట. ఒకే గ్రామంలో ఉన్నప్పటికి అన్నదమ్ముళ్లు మాట్లాడుకోవడం లేదు. దీంతో ఇద్దరిని ఎలా అయినా కలపాలని నాగయ్య కుమారుడు శ్రీనివాస్ ఎన్నో సార్లు ప్రయత్నించి లాభం లేకుండా పోయింది. అయితే నాలుగు రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మరణించగా.. మూడు రోజుల కార్యానికి అన్నదమ్ములు ఇద్దరు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరిని కలపాలని శ్రీనివాస్.. వారి పాత రోజులు, జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఇద్దరు కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి ఆరు పదుల వయసులో, కాటికి వెళ్లే ముందు పంతాలు ఎందుకని, ఇక నుంచి అయినా కలిసి బ్రతుకుదాం అని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆలింగనం చేసుకుని కంట తడి పెట్టుకున్నారు.