NTV Telugu Site icon

Hyderabad: పార్కులకు వెళ్లే లవర్స్‌కు చేదువార్త.. ఆ పని చేస్తే దొరికిపోతారు

Hyderabad Parks

Hyderabad Parks

Hyderabad: హైదరాబాద్ నగరంలో సాధారణంగానే కొన్ని పార్కులకు ఫ్యామిలీలు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇందిరా పార్క్ లాంటి పార్కుల్లో కొందరు ప్రేమికులు బహిరంగంగా రొమాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. మరికొన్ని పార్కుల్లో అయితే చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 8 వేల కెమెరాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బుధవారం నాడు జీహెచ్ఎంసీ ఆమోదముద్ర వేయనుంది. దీని కోసం రూ.19.18 కోట్ల పనులను జీహెచ్ఎంసీ ఈఈఎస్‌ఎల్‌ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ నగరంలోని విస్తరిత ప్రాంతాలతో పాటు మురికివాడలు, పార్కుల్లో 8వేల కెమెరాలను ఏర్పాటు చేయనుంది.

Read Also: Health Tips: చలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం

అటు ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఐటీ, ఫార్మా, సర్వీస్‌ సెక్టార్లు విస్తరిస్తున్న నేపథ్యంలో ‘పబ్లిక్‌ సేఫ్టీ మెజర్స్‌’లో భాగంగా భద్రత ప్రమాణాలను మరింత పటిష్టపరచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా 8వేలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈఈఎస్‌ఎల్‌ కంపెనీకి పనుల బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.