Auto Drivers: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాక 6 హామీలో భాగంగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో.. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబరు 9 నుంచి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొంది. మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమదేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఎక్కించకపోవడంతో రోజువారి ఆదాయం కోల్పోయామని.. కుటుంబాలను ఎలా పోషించుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Kandala Upender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాలపై కేసు.. భూకబ్జా ఆరోపణలు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు ఆటోడ్రైవర్లు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహాధర్నా చేపడతామని ఆటో కార్మికులు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోతున్నామన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లను ఆదుకోవాలన్నారు. తమకు ప్రతినెలా రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఈ మహా ధర్నా పిలుపు పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Manickam Tagore: మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది: మాణిక్కం ఠాగూర్