NTV Telugu Site icon

MLAs Resignation: నిన్న మెదక్ నేడు మంచిర్యాల… దివాకర్ రావ్ కు రాజీనామాల గోల

Diwaker Rao

Diwaker Rao

MLAs Resignation: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఎక్కడ చూసినా సందడే సందడి. రాజకీయ పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్న వేల మునుగోడులాగే ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని, అలా చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు ఎమ్మెల్యేల మీద వత్తిడి చేస్తున్నారు. నిన్న మెదక్ జిల్లా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఫోన్‌ కాల్‌ రాగా.. నేడు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావ్ కి ఫోన్లమీద ఫోన్లు వస్తున్నాయి. నిన్నటి వరకు మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలని వరుస ఫోన్లు రావడం నేడు అదే పరిస్థితి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావ్‌ కు ఫోన్‌ రావడంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది.

మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావ్ రాజీనామా చేయాలని ఆడియోలు విడుదలయ్యాయి. నియోజక వర్గం అభివృద్ది కావాలంటే ఉప ఎన్నిక రావాలని తెలిపారు.అందుకే దివాకర్‌ రావ్‌ రాజీనామా చేయాలంటూ నస్పూర్ కు చెందిన ఓ వ్యక్తి ఆడియో విడుదల చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ అవుతున్నాయి. హుజూరాబాద్, మునుగోడు తరహాలో ఎన్నికల వస్తే నియోజక వర్గం అభివృద్ది చెందుతుంది అంటూ ఆడియోలో ఆవ్యక్తి కోరాడు. దీంతో ఆవార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందే మెదక్‌ ఎమ్మెల్యేలకు ఫోన్‌ కాల్‌ రెండు రోజుల నుంచి కలకలం రేపుతుంటే ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావ్‌ కు ఫోన్‌ కాల్‌ రావడంతో ఈ ఆడియో కాల్ వార్త సంచళనంగా మారింది.

Read also: MLAs Resignation: నిన్న మెదక్ నేడు మంచిర్యాల… దివాకర్ రావ్ కు రాజీనామాల గోల

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విష్ణువర్థన్ రెడ్డి ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన వ్యక్తిని బెదిరించినట్టు తెలుస్తోంది. నిన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి రాజీనామా చేయాలని అడిగాడు టెక్రియాల్ గ్రామ వాసి స్వామి. మేడం మీరు రాజీనామా చేస్తే మన మెదక్ నియోజకవర్గం మునుగోడు లాగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. మంచిది అంటూ వెంటనే కాల్ కట్ చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. ఈ విషయం అందరి నోట పడింది.

మొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి రాజీనామా చేయాలని ఫోన్ చేశాడు మెదక్ నియోజకవర్గ వాసి. నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కూడా రాజీనామా చేయాలని ఫోన్ చేశాడో యువకుడు. మీరు రాజీనామా చేస్తే మన నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పాడా యువకుడు. అయితే ఆ యువకుడికి ఘాటైన బదులిచ్చారు మదన్ రెడ్డి. నేనెందుకు రాజీనామా చేస్తా నాకు తీట పడ్డదా అని చెప్పారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రాజీనామా కాల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడో వ్యక్తి. మీరు కూడా రాజీనామా చేస్తే మునుగోడు లాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పాడు. మంచిది అంటూ వెంటనే కాల్ కట్ చేశారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డ. ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Kunamneni Sambasiva Rao: బండి సంజయ్‌కి సవాల్.. దమ్ముంటే మోడీతో ప్రమాణం చేయించు

Show comments